బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనుష్క శర్మ ప్రస్తుతం గతంలో మాదిరిగా సినిమాలు చేయకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి పేరుతో పాటు ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నది. ఇటీవల విరాట్ కోహ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విరాట్ కోహ్లి అందుకుంటున్న ఆదాయం గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో కనపడుతూనే ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అతనికీ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ కూడా ఆ ఇన్‌స్టాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంటుంది. వీరిద్దరూ కూడా ఎలాంటి ఫొటో పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి.
అనుష్కశర్మ విరాట్‌కోహ్లీ ఐదేళ్ల డేటింగ్ అనంతరం 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి ఇబ్బంది లేకుండా సంప్రదాయాల ప్రకారం.. ఏడు అడుగులు వేసారు. పెళ్లి అనంతరం కూడా ఈ స్టార్ సెలబ్రిటిలు వారి కెరీర్‌ను యధావిధిగా కొనసాగిస్తూనే మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకవిధంగా చాలా మందికి స్పూర్తిగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.
Advertisement
విరాట్ కోహ్లి అనుష్క శర్మ ఇద్దరు కూడా మొదట కొన్ని యాడ్స్ ద్వారా కలిసి నటించడం క్లోజ్ అయ్యారు. ఆ తరువాత మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరూ ప్రేమ ప్రయాణంలో మునిగితేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పట్లో వీరి గురించి ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక పెళ్లి అనంతరం గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వీరి కూతురుకి వమికా కోహ్లీ అని పేరు కూడా పెట్టారు.
కూతురు పుట్టిన తరువాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కశర్మకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా సెక్యూరిటీ ఉండేవిధంగా బాడీగార్డ్స్‌ను ఏర్పాటు చేసారు. దాదాపు కూతురి సెక్యూరిటీ కోసమే విరాట్‌కోహ్లీ కోట్లలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.
ప్రపంచంలోనే అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లీ కూడా టాప్ లిస్ట్‌లో ఉన్నాడు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య 178 మిలియన్స్ కు పెరిగింది. ఇక ఇన్‌స్టాగ్రామ్ విరాట్ బ్రాండ్‌కు సంబంధించి చేసే ప్రతీపోస్ట్ ద్వారా అతనికీ భారీగా ఆదాయం వస్తుందని ఫోర్బ్స్‌లోని ఇటీవల నివేదిక ప్రకారం.. విరాట్ ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు అత్యధికంగా రూ.5కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం.
కేవలం ఇన్‌స్టాలో మాత్రమే కాదు. అతను తన ఫేస్‌బుక్ ట్విట్టర్ పేజీల్లో అంశాలను పోస్ట్ చేయడానికి రకరకాల ధరలుంటాయి. అతను తలచుకుంటే రూ.100 కోట్ల ఆదాయం అందుకోవడం కోసం ఎక్కువ సమయం పట్టదు. ఒక 20 కిపైగా బ్రాండ్ పోస్టులు చేసినా సరిపోతుంది. కేవలం సోషల్ మీడియా ద్వారా దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న సెలబ్రిటీగా కోహ్లీ నిలిచాడు.