Home » పెళ్లి కాకుండానే తల్లవుతున్న హీరోయిన్….బేబీ బంప్ తో ఫోటో వైరల్…!

పెళ్లి కాకుండానే తల్లవుతున్న హీరోయిన్….బేబీ బంప్ తో ఫోటో వైరల్…!

by AJAY
Ad

ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక నితిన్ హీరోగా నటించిన అఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినప్పటికీ అనుపమ అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకున్న అనూ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తూ వచ్చింది.

Anupama

Advertisement

కానీ రీసెంట్ గా దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన రౌడీ బాయ్స్ సినిమాలో నటించి స‌ర్ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో అనుపమ గ్లామర్ షో తో రెచ్చిపోయింది. అంతే కాకుండా గ్లామర్ పాత్రలకు సైతం తాను రెడీ అంటూ దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న విజయం సాధించలేదు.

Advertisement

anupama

కానీ ఈ సినిమాలో కొన్ని సీన్లు ఒప్పుకోవడంతో ప్రేక్షకులు రెమ్యూనరేషన్ కోసమే అనుప‌మ‌ అలాంటి సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ విమర్శలు కురిపించారు. ఇదిలా ఉంటే అనుప‌మ‌ పరమేశ్వరన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో అనుపమ నైట్ డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపిస్తోంది.

anupama pregnency

దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే కంగ్రాట్స్ అనుపమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఫోటో చాలా రోజుల క్రితం ది అని అనుప‌మ పేర్కొంది. దాంతో ఏదో సినిమా షూటింగ్ కోసం అనుప‌మ ఇలా రెడీ అయిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading