Home » Anu Emmanuel : ఆ స్టార్ నటుడితో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ ?

Anu Emmanuel : ఆ స్టార్ నటుడితో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ ?

by Bunty
Ad

అను ఇమ్మానుయేల్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన అందంతో ఎంతోమంది అభిమానులను తన వైపుకు తిప్పుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందం మాత్రమే కాకుండా అదృష్టం కూడా కలిసిరావాలి. ఆ విషయంలో ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసి రావడం లేదు. నాని సరసన మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది.

Advertisement

తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నటువంటి ఈ భామ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, గోపీచంద్ వంటి స్టార్ హీరోల సరసన నటించి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కానీ తాను నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతున్నాయి. దీంతో ఈ అమ్మడు పాతాళానికి పడిపోతుంది. తాను నటించిన సినిమాలేవి హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు గ్లామర్ షోలు చేసినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.

Anu Emmanuel

ఈ అమ్మడు సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు స్టోరీ వినకుండా సినిమాలకు ఓకే చెప్పేస్తుందట. అందుకేనేమో సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. రవితేజ సరసన హీరోయిన్గా రావణాసుర సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి ఇండస్ట్రీలో అవకాశాలు రావని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి తరుణంలోనే కోలీవుడ్ హీరో ను ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. పెళ్లి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయట. వచ్చే వేసవిలో అను ఇమ్మానుయేల్ , ఆ హీరో వివాహం జరుగనుందని సమాచారం.

Advertisement

 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading