సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయా ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు అర్థం చేసుకోలేరు.. ఇక్కడ వివాహాలు విషయానికి వస్తే ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు రెండు మూడు మ్యారేజ్ లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదంతా ఇండస్ట్రీలో కామన్ గా చూస్తారు.. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరికి ప్రత్యేక గౌరవప్రదమైన స్థానం.. దాదాపుగా ఏఎన్ఆర్ నుంచి మొదలు అఖిల్ వరకు వీరికి సినిమా ఇండస్ట్రీతో 60 ఏళ్ల అనుభవం ఉంది.. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున ఆయన వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.. స్టార్ హీరోగా ఎదిగారు.. ఆయన సినిమాలే కాకుండా వివిధ వ్యాపారాల్లో కూడా ఆయనది అందెవేసిన చేయి..
Also Read: మీ పిల్లలను దోమల నుంచి రక్షించాలంటే ఈ చిట్కాలను పాటించండి..!
Advertisement
Advertisement
ఎప్పుడు,ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది బాగా తెలిసిన హీరో నాగార్జున.. ఇన్ని తెలిసిన నాగార్జున పెళ్లి విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ వేశారని ఓ సందర్భంలో అన్నారట ఏఎన్నార్.. నాగార్జున మొదటి వివాహం రామానాయుడు కుమార్తె లక్ష్మితో జరిగింది.. వీరికి నాగచైతన్య మొదటి సంతానంగా పుట్టారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత శివ సినిమా హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నారు నాగార్జున. అయితే అమలను పెళ్లి చేసుకోవడం ఏఎన్నార్ కు అస్సలు ఇష్టం లేదట.. అసలు కారణం ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వారి జీవితాలు వ్యక్తిగతంగా క్రమశిక్షణతో ఉండవని నమ్మే వారంట ఏఎన్ఆర్..
ఆయన సినిమా రంగంలో ఉండటం వల్లనే ఆ ఎవరు కూడా పిల్లనివ్వడానికి ముందుకు రాలేదట.. ఆయన మేనమామలు కూడా దూరంగానే ఉన్నారట.. అందువల్లే అమలను ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఏఎన్నార్ కు ఇష్టం లేదని చెప్పారట.. ఎందుకంటే అమల తెలుగమ్మాయి కాకపోవడం, నాగార్జునను ఏవిధంగా అర్థం చేసుకుంటుందనే సందేహం ఉండటం వల్ల ఈ విషయంలో కాస్త తడబడ్డారట ఏఎన్ఆర్.. కానీ అమల నాగార్జునను వివాహం చేసుకున్న తరువాత వారి కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ హుందాగా వుంటూ వచ్చింది. అక్కినేని ఫ్యామిలీలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.
also read:
- విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఆ ఉద్యోగం కూడా చేశాడా..?
- నాగార్జునను దారుణంగా అవమానించిన సమంత.. గరమవుతున్న అక్కినేని అభిమానులు..!!