నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణకి తృటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో వెళ్తుండగా.. రామకృష్ణ కారుకి యాక్సిడెంట్ అయింది.
Advertisement
ఈ ప్రమాదంలో రామకృష్ణకి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. కారును పక్కనే నిలిపి రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ విషయంపై నందమూరి అభిమానులు మాత్రం కాస్త ఆందోళన చెందుతున్నారు.
గతంలో నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్ కారు యాక్సిడెంట్ లోనే చనిపోయారు. ఎన్టీఆర్ కి కూడా గతంలో కారు ప్రమాదం తప్పింది. ఇప్పుడు నందమూరి రామకృష్ణ కి కూడా కారు యాక్సిడెంట్ అవ్వడం ఇవన్ని చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. నందమూరి రామకృష్ణ యాక్సిడెంట్ గురించి మాత్రం కుటుంబం ప్రకటించలేదు.
Advertisement
Also Read : చనిపోయే ముందు నటుడు రంగనాథ్ గోడపై ఏమని రాసారో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు!
ఇటీవలే బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న తారకరత్నను పరామర్శించి వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు రామకృష్ణ. తారకరత్న ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుందని.. ఎక్మో పెట్టలేదనేది తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. తారకరత్న శరీర అవయవాలన్ని కూడా బాగా పని చేస్తున్నాయని.. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని.. అంతకు మించి ఎలాంటి ప్రమాదం లేదని రామకృష్ణ వివరించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య విద్యాలయం పేరు మార్పు సందర్బంలో కూడా రామకృష్ణ స్పందించారు. అప్పుడప్పుడు వైసీపీ విధానాలను రామకృష్ణ విమర్శిస్తుంటారు.
Also Read : తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఉద్యోగాలు… జీతం రూ.24 వేలు.. వివరాలు ఇవే