Home » హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

by Bunty
Ad

 

రజనీకాంత్ నటించిన “జైలర్” సినిమా స్టోరీ మామూలుగా ఉన్నప్పటికీ ఈ సినిమా హిట్ అయింది. దానికి గల కారణం అనిరుద్ అనే చెప్పాలి. మామూలు సీన్స్ అయినప్పటికీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ సీన్ ని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఆ సినిమాలోని పాటలు ఫ్యాన్స్ చెవిలో మారుమ్రోగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అనిరుద్ రెమ్యూనరేషన్ కి సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. జైలర్ సినిమాలో నటించినందుకు గాను రజినీకాంత్ కి 110 కోట్ల పారితోషికాన్ని అందించారట.

Advertisement

ఇక సినిమాలో నటించిన వారిలో రజనీకాంత్ తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వ్యక్తి అనిరుద్ అట. అనిరుద్ ఈ సినిమాకి గాను 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారట. మొన్నటి వరకు 8కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవాడు. ఇక ఇప్పుడు ఏకంగా జైలర్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రెమ్యూనరేషన్ నీ దాటేశాడు. ఇక అనిరుద్ ఇప్పటినుంచి 10 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నారట. ఏఆర్ రెహమాన్ ఒక్కో సినిమాకి గాను 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇక అనిరుద్….ఏఆర్ రెహమాన్ ని మించి తీసుకుంటున్నాడు.

Advertisement

ఇక అనిరుద్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు నిర్మాతలు కూడా అనిరుద్ వెంట క్యూ కడుతున్నారు. 10 కోట్ల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. ఇక అనిరుద్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి జెర్సీ సినిమాతో అదరగొట్టాడు. ఇక అనిరుద్ ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వస్తున్న ‘దేవరా’ సినిమా కోసం పనిచేస్తున్నాడు. ఇక ఇప్పుడు ‘జైలర్’ సినిమాతో తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు అనిరుద్. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అనిరుద్ హవా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి : 

“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!

Visitors Are Also Reading