భారత్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తిరుగులేని స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. టీమిండియా కన్నా విరాట్ కోహ్లీ స్టార్ రేంజ్ వెయ్యి రెట్లు ఎక్కువగా పెరిగింది. అలాంటి బ్రాండ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిండచడంలో బీసీసీఐ సక్సెస్ అయింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్న తరువాత అతన్నుంచి బలవంతంగా వన్డే కెప్టెన్సీ పగ్గాలను తీసుకుంది. పక్కా ప్రణాళికతోనే టెస్ట్ కెప్టెన్ నుంచి కూడా కోహ్లీని దూరం చేసింది.
Advertisement
భారత జట్టుకు అత్యంత విజయవంతమైన టెస్ట్ సారథిగా ఉన్న విరాట్ కోహ్లీని ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘Shame on BCCI’, ‘BCCI politics’ హ్యాష్ ట్యాగ్‌లతో తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ తరువాత వచ్చే టీమిండియా సారథిగా ప్రచారంలో ఉన్న రోహిత్ శర్మతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జైషాలపై కూడా ఈ రకమైన విమర్శలు వస్తున్నాయి.
మరొక వర్గం వారు మాత్రం అనీల్ కుంబ్లే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 2016 నుంచి 2017 వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే వ్యవహరించాడు. అతను కోచ్‌గా ఉన్న సమయంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తలెత్తిన విభేదాల కారణంగా అర్థాంతరంగా ఆ పదవీ నుంచి కుంబ్లే తప్పుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అనిల్‌కుంబ్లేను హెడ్ కోచ్‌గా తప్పించకపోతే తాను కెప్టెన్ గా కొనసాగను అని బీసీసీఐ అధికారులను బెదిరించాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
కుంబ్లే మీద కోపంతోనే 2017 ఛాంపియన్స్ ట్రోపి ఫైనల్‌లో భారత జట్టు కావాలనే ఓడిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ వివాదం రేగిన సమయంలో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్‌లో సభ్యునిగా ఉన్నాడు ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఆ సమయంలో విరాట్ కోహ్లీకి సర్ది చెప్పేందుకు గంగూలీ, టెండూల్కర్, ద్రవిడ్ ఎంత ప్రయత్నించినా.. అతను వినిపించుకోలేదు.
దానికి ప్రతిఫలమే నాలుగేళ్ల తరువాత విరాట్ కోహ్లీ అనుభవిస్తున్నాడు అని పేర్కొంటున్నారు కుంబ్లే ఫ్యాన్స్. మరోవైపు తన ఆహాన్ని దెబ్బతీసిన విరాట్ డామినేషన్‌కు చెక్ పెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూసిన సౌరవ్ గంగూలీ, ఇప్పుడు అన్ని విధాలుగా అతన్ని కార్నర్ చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అని పేర్కొంటున్నారు దాదా అభిమానులు. టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన లెజెండరీ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కుంబ్లేకు విరాట్ కోహ్లీ చేసిన అవమానాలతో పోలిస్తే.. ఇప్పుడు అతనికీ జరిగిన పరాభవం తక్కువే అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.