Home » రికార్డు సృష్టించిన ఆండ్రూ టై.. ప్రపంచంలోనే తొలి బౌలర్ గా..!

రికార్డు సృష్టించిన ఆండ్రూ టై.. ప్రపంచంలోనే తొలి బౌలర్ గా..!

by Anji
Ad

ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై టీ-20 క్రికెట్ లో ప్రపంచ రికార్డు సాధించాడు. టీ-20లలోనే అత్యంత వేగంగా 300 వికెట్లను పడగొట్టిన బౌలర్ గా ఆండ్రూ టై రికార్డులకెక్కాడు. బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కార్చెర్ కి ఆడుతున్న టై.. ఫైనల్ లో బ్రిస్బేన్ హీట్ పై జేమ్స్ బేజ్లే ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్ లలోనే ఈ రికార్డును సాధించాడు. 

Advertisement

ఇక అంతకు ముందు ఈ రికార్డు ఆప్గానిస్తాన్ స్టార్ పేసర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ తన టీ-20 కెరీర్ లో 213 మ్యాచ్ లలో 300 వికెట్లను తీశాడు. తాజాగా ఈ మ్యాచ్ తో ఆండ్రూ టై రషీద్ రికార్డును బ్రేక్ చేసాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 222 మ్యాచ్ లలో 300 వికెట్లను సాధించాడు. 

Advertisement

Manam News

బిగ్ బాష్ లీగ్ -2023 ఛాంపియన్స్ గా పెర్త్ స్కార్చెర్స్ నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్ లో బ్రిస్బేన్ హీట్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్ ని గెలుచుకుంది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతులు ఎదుర్కున్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేసాడు. అదేవిధంగా చివరిలో నిక్ హబ్బన్ (7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ (11 బంతుల్లో 25 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.  

Also Read :  టీమిండియా క్రికెటర్‌ భార్యను మోసం చేసిన హైదరాబాదీలు !

Visitors Are Also Reading