Ad
భారత జట్టు యొక్క స్టార్ హీటర్లలో యువరాజ్ సింగ్ ఒక్కడు అనే విషయం తెలిసిందే. బ్యాట్ తోనే కాకుండా బంతితో కూడా మెప్పించడం యువరాజ్ కు తెలుసు. అయితే యువరాజ్ కెరియర్ లో ఎన్ని రికార్డులు ఉన్న.. తన పేరు వినగానే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు. 2007 ప్రపంచ కప్ లో భాగంగా యువరాజ్ ఇంగ్లాండ్ పైన ఈ ఘనత అనేది సాధించాడు.
భారత ఇన్నింగ్స్ యొక్క 19వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఆరు బంతులను వరుసగా సిక్సులు బాదాడు. అలాగే టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 12 బంతుల్లోనే అర్ధశతకం అనేది పూర్తి చేసుకున్నాడు. ఈ రికార్డు ఇప్పటివరకు కూడా బ్రేక్ కాలేదు. ఇక ఈ ఘనత అనేది యువీ సాధించి నేటికీ 15 ఏళ్ళు పూర్తి అవుతుంది. అయితే యువీ ఈ ఆరు సిక్సులు కొట్టేముందు ఇంగ్లాండ్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తో జరిగిన గొడవ అందరికి తెలిసిందే.
అయితే అప్పుడు ఫ్లింటాఫ్ ఏం అన్నాడో యువీ చెప్పాడు. ఆ 18 ఓవర్ కు ముందు ఫ్లింటాఫ్ వేసిన ఓవర్ లో యువీ బౌండరీలు కొట్టడంతో… నావి చెత్త షాట్స్ అని ఫ్లింటాఫ్ అన్నాడు. మా ఇద్దరి మధ్య అలా వాగ్వాదం ప్రారంభమైంది. ఆ తర్వాత నానా గొంతు కోస్తాను అని ఫ్లింటాఫ్ అన్నాడు. నేను నా బ్యాట్ తో బుర్ర పగలకొడుతాను అని చెప్పా. కానీ తర్వాత అంపైర్ వచ్చి.. నన్ను ఆపాడు అని యువీ చెప్పాడు.
ఇవి కూడా చదవండి :
ఆ మహిళా క్రికెటర్ బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం..!
ధోని, కోహ్లీలను నెత్తిన పెట్టుకోవడం ఫ్యాన్స్ ఆపాలి..!
Advertisement