యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కన్నుమూసింది. ఈ విషయాన్ని విష్ణు ప్రియ తానే స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన తల్లితో కలిసి ఉన్నప్పటి ఫోటో షేర్ చేసి విష్ణు ప్రియా ఎమోషనల్ అయింది. తన పోస్టులో “మై డియర్ అమ్మ.. ఈరోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు.. నేను తుది శ్వాస విడిచే వరకు నీ పేరును నిలబెట్టేందుకు కృషి చేస్తాను..
Advertisement
నువ్వే నా బలం.. నువ్వే నా బలహీనత.. ఈ అనంత విశ్వంలో నువ్వు కలిసి పోయావు. నువ్వు ప్రతి చోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు.. ఈ భూమిపై నాకు జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు.. అందుకోసం నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మ” అంటూ యాంకర్ విష్ణు ప్రియ భావోద్వేగా భరితమైన పోస్టును షేర్ చేసింది.
ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర కమెడియన్లు , యాంకర్లు, యాక్టర్లు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ విష్ణు ప్రియ ఒక యూట్యూబర్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగింది.. ఓవైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు హీరోయిన్ గా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలో వాంటెడ్ పండుగాడు సినిమాలో హీరోయిన్ గా మెప్పించింది అని చెప్పవచ్చు.
also read: