బుల్లి తెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. పేరుకు తగ్గట్టుగానే ఈ షో ముందు అన్ని షోలు కూడా చిన్నవే అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గత ఆదివారం పూర్తయిన సంగతి తెలిసిందే. పదిహేను వారాల పాటు సాగిన ఈ షోలోకి మొత్తం పంతొమ్మిది మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఐదుగురు సభ్యులు పదిహేనవ వారం వరకూ హౌస్ లో నిలిచారు. ఇక టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ లలో సిరి, షణ్ముక్, శ్రీరామ్, సన్నీ, మానస్ లు ఉన్నారు. వారిలో సన్నీ విన్నర్ గా నిలవగా షణ్ముక్ రన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ ల రెమ్యునరేషన్ తెలుసుకోవాలని అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది.
కాబట్టి ఎవరెవరు ఎంత తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ రెమ్యనరేషన్ కింద రూ.30లక్షలు తీసుకున్నాడు. అదే విన్నర్ గా నిలిచి రూ.78 లక్షల ప్రైజ్ మనీ తీసుకున్నాడు. దాంతో మొత్తం సన్నీకి రూ.1.08 కోట్లు ముట్టింది. అంతే కాకుండా రన్నర్ గా నిలిచిన షణ్ముక్ కు పదిహేను వారాలకు రూ.75లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. సిరి హన్మంతుకు పదిహేను వారాలకు గాను రూ.30లక్షలు, శ్రీరామ చంద్రకు రూ.45లక్షలు, మానస్ కు రూ.30 లక్షలు రెమ్యునరేషన్ లు పుచ్చుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ యంకర్ రవి.
Advertisement
Advertisement
బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చిన మిగతా సభ్యులు అందరి కంటూ ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ కూడా యాంకర్ రవి నే కావడం విశేషం. దాంతో రవి టైటిల్ గెలిచి తీరతాడని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రవి పన్నెండో వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకోలేకపోయినప్పటికీ బిగ్ బాస్ ద్వారా రవి విన్నర్ కంటే సంపాదించినట్టు తెలుస్తోంది. యాంకర్ రవికి వారానికి పదిలక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని ఆ లెక్కన పన్నెండు వారాలకు గానూ కోటి ఇరవై లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం.
also read : ఆర్ఆర్ఆర్ నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు ఇవే…!