Home » బిగ్ బాస్ 7లోకి యాంకర్ రష్మీ…. రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…!

బిగ్ బాస్ 7లోకి యాంకర్ రష్మీ…. రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…!

by AJAY
Ad

యాంకర్ రష్మీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. రష్మీ మొదట సైడ్ పాత్రలు చేస్తూ సినిమాల్లో కనిపించింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయ్యింది. ఇక జబర్దస్త్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవడం తో పాటు రష్మీ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.

Anchor Rashmi

Advertisement

 

ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంది. అయితే ఇప్పుడు రష్మీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 వ సీజన్ కోసం నిర్వాహకులు సిద్దం అవుతున్నారు. కాగా ఆ సీజన్ లో రష్మీకి ఛాన్స్ ఇచ్చారట.

Advertisement

ఇక రష్మీ కూడా హౌస్ లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. కానీ రష్మీ చెప్పిన రెమ్యునరేషన్ మరియు ఆమె పెట్టిన కండిషన్స్ మాత్రం నిర్వాహకులను షాక్ అయ్యేలా చేశాయి. రష్మీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఒక్క వారానికే రూ. 7 నుండి రూ.8 లక్షల వరకూ డిమాండ్ చేసింది.

rashmi gautham

rashmi gautham

అంతే కాకుండా నిర్వాహకులకు ముందే కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టు గా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading