తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ ఝాన్సీ అంటే తెలియని వారు ఉండరు. సీనియర్ యాంకర్స్ లో ఝాన్సీ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అప్పట్లో యాంకరింగ్ చేసే వాళ్ళు అంటే ముందుగా సుమా ఆ తర్వాత ఝాన్సీ మాత్రమే ఉండేవారు. అలా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ కేవలం యాంకరింగ్ లోనే కాకుండా ఎన్నో చిత్రాల్లో కూడా నటించింది. మంచి గుర్తింపును సాధించింది. కానీ ప్రస్తుతం ఆమె జోరు తగ్గిందని చెప్పవచ్చు. ఈమధ్య బుల్లితెరపై ఈమె హడావిడి కాస్త తగ్గినా వెండితెరపై మాత్రం జోరు కొనసాగిస్తోంది.
also read:ది కేరళ స్టోరీ సినిమా పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్…!!
Advertisement
అలాంటి ఝాన్సీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె కెరియర్ లో తనకి ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టింది. నా గురించి కొత్తలో చాలామంది ఈమె ఫైర్ బ్రాండ్, కోపం, పొగరు ఎక్కువగా ఉంటుంది అనుకునేవారు. కానీ నాతో కలిసి పని చేసిన వారికి తెలుసు నేను ఏంటన్నది. నాతో జర్నీ చేసినవాళ్లు చాలామంది నన్ను అర్థం చేసుకొని ఏళ్ల తరబడి నాతో కలిసి ఉన్నారు. నచ్చని వారు తొందరలోనే నాతో కట్ చేసుకుని దూరంగా ఉండేవారు. ఇక నా జీవితంలో జరిగిన దారుణం ఏమిటంటే నేను ఒక డాన్స్ షోకి 99 ఎపిసోడ్స్ కి యాంకర్ గా చేశాను.
Advertisement
also read:టైగర్ 3లో సల్మాన్, షారుక్ ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?
ఆ షో కి మంచి పేరు వచ్చింది. కానీ 100 వ ఎపిసోడ్ కి నా స్థానంలో వేరే వాళ్ళతో యాంకరింగ్ చేయించారు. దానికి కారణం ఏంటన్నది ఇప్పటికీ తెలియదు. నేను అడగలేదు. దీనివల్ల నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా నన్ను ఎంతోమంది వాడుకొని మోసం చేశారు. కానీ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని కక్ష సాధించే పని నేను ఎప్పుడు చేయలేదు. అది మంచితనమో పిచ్చితనమో తెలియదు అంటూ ఎమోషనల్ అయింది యాంకర్ ఝాన్సీ.
also read:Title: బాలయ్య బోయపాటి సినిమా స్టోరీ లీక్… నేట్టింట వైరల్..!