Home » దయచేసి నన్ను వదిలేయండి.. నాకు ఓ ఫ్యామిలీ ఉంది.. అనసూయ ట్వీట్ వైరల్..!

దయచేసి నన్ను వదిలేయండి.. నాకు ఓ ఫ్యామిలీ ఉంది.. అనసూయ ట్వీట్ వైరల్..!

by Anji
Ad

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరధ్వాజ్ ఇప్పుడు బుల్లితెరపై కంటే వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తోంది. రంగస్థలం, పుష్ప, రంగమార్తాండ వంటి సినిమాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ.ఇటీవల విమానం మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనసూయ ఇందులో పోషించిన సుమతి పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక సినిమాల విషయం పక్కకు పెడితే ఇటీవల అనసూయ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. కొద్ది రోజుల ముందు హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ.. ఆమె షేర్ చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. 

Advertisement

 

 

 

 

ముఖ్యంగా ఖుషి సినిమా పోస్టర్ లో హీరో పేరు ముందు The తప్పు పడుతూ అనసూయ ట్వీట్ చేయడం.. దీనికి కౌంటర్లు, ప్రతీ కౌంటర్లు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ వద్ద పని చేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి మరీ తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడంటూ.. అనసూయ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ తనకు మంచి స్నేహితుడు అన్న అనసూయ ఇకపై అతనిపై కామెంట్స్ చేయను అని పేర్కొంది. అదేవిధంగా గొడవలు, వివాదాలకు దూరంగా ఉంటాను అని చెప్పింది. 

Advertisement

తాజాగా మరోసారి ఈ విషయంపై నోరు విప్పింది అనసూయ. తనకు ఓ ఫ్యామిలీ ఉందని.. తనను వదిలేయండంటూ ట్విట్టర్ వేదికగా ఓ సుదీర్ఘపోస్ట్ షేర్ చేసింది అనసూయ. అందరికీ నమస్కారం.. గత కొద్ది రోజులుగా నాకు చాలా ట్వీట్స్ వస్తున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను అగౌరవ పరిచేందుకు నా పేరును వాడుకుంటున్నారు. ఇలా చేస్తున్నందుకు నాకు చాలా అమర్యాదగా, అగౌరవంగా ఉంది. ఇది నా పేరును కించ పరిచేవిధంగా ఉంది. వీటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరమైన బాధను కలిగిస్తోంది. ఇది నా లైఫ్. నాకు నచ్చిన విధంగా లీడ్ చేస్తున్నాను. నేను ఎవ్వరి జోలికి వెళ్లాలనుకోవడం లేదు. నా స్వశక్తితో నేను ఎదిగిన మహిళను. నా గురించి గొప్పగా చెప్పేందుకు నాకు ప్రత్యేకంగా పీఆర్ టీమ్స్ లేవు. మీరు నన్ను ఎంకరేజ్ చేయడం ఇష్టం లేకపోతే కనీసం నా నుంచి దూరంగా ఉండండి. నాకు సంబంధం లేని విషయాల్లోకి నా పేరు ను మాత్రం లాగకండి. నాకు ఓ ఫ్యామిలీ ఉంది. దయచేసి ఆపేయండి అని రిక్వెస్ట్ చేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వరల్డ్ కప్ ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా రీ ఎంట్రీ..!

ఎన్టీఆర్ డ్యాన్స్ పై శేఖ‌ర్ మాస్ట‌ర్ ఏమ‌న్నారో తెలుసా..?

ఆదిపురుష్ మూవీపై ఆశ్చర్యకర కామెంట్స్ చేసిన అలనాటి రాముడు.. నేను అంగీకరించను అంటూ ?

Visitors Are Also Reading