Home » నేను పెరుగుతాను..త‌గ్గుతాను మీకెందుకు..అన‌సూయ వార్నింగ్..!

నేను పెరుగుతాను..త‌గ్గుతాను మీకెందుకు..అన‌సూయ వార్నింగ్..!

by AJAY
Ad

యంక‌ర్ గా చెప్పుకునే కంటే ఇప్పుడు యాక్ట‌ర్ అన‌సూయ అనే చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఈ జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ ఇప్పుడు యాంకర్ గా కంటే సినిమాలు చేస్తూనే ఫుల్ బిజీ అయిపోయింది. రీసెంట్ గా వ‌చ్చిన జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోల‌లోనూ కూడా అన‌సూయ క‌నిపించ‌డం లేదు. దాంతో అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ బై చెప్పిందంటూ కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక రీసెంట్ అనసూయ పుష్ప సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

ఈ సినిమాలో అన‌సూయ దాక్షాయ‌ణి పాత్ర‌లో క‌నిపించి అద‌ర‌గొట్టింది. ఈ సినిమాలో అన‌సూయ పాత్ర నిడివి త‌క్కువ‌గా ఉన్నా పుష్ప సెకండ్ పార్ట్ లో మాత్రం అనసూయ పాత్ర హైలెట్ గా నిల‌వ‌బోతుంద‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ రీసెంట్ ఇంట‌ర్య్వూలో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అన‌సూయ త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అన‌సూయ ఇలా అయ్యిందేంటి అంటూ తంబ్ నెయిల్స్ పెడుతున్నార‌ని…తాను లావు పెర‌గ‌టం స‌న్న బ‌డ‌టం త‌న ఇష్ట‌మ‌ని పేర్కొంది.

అలాంటి కామెంట్లు పెట్ట‌డానికి ఏమీ అనిపించ‌డం లేదా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. స్ట్రాంగ్ గా ఉండాల‌ని అంద‌రూ చెబుతారని ఒక‌వేళ త‌మ‌పై వ‌స్తున్న ట్రోల్స్ పై కామ్ గా ఉన్నారంటే అది ఫేక్ అని ప్ర‌తి ఒక్క‌రూ బాధ‌ప‌డ‌తారని అన‌సూయ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తన‌పై ట్రోల్స్ చేసే వారిని తాను అంతకంటే ఎక్కువ అన‌గ‌ల‌ను అని కానీ తాను అలా చేయ‌న‌ని అన‌సూయ పేర్కొంది.

Visitors Are Also Reading