Home » “ద‌ర్జా”గా అన‌సూయ‌…లుక్ అదుర్స్..!

“ద‌ర్జా”గా అన‌సూయ‌…లుక్ అదుర్స్..!

by AJAY

జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ యాంక‌ర్ అనసూయ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవ‌లే అన‌సూయ పుష్ప సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అన‌సూయ సునీల్ కు భార్య‌గా నటించి ఆక‌ట్టుకుంది. అయితే ఇప్పుడు సునీల్ అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ద‌ర్జా అనే టైటిల్ తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పీఎస్ఎస్ ఎంట‌ర్టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స‌లీమ్ మాలిక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

anasuya darja

anasuya darja

ఇక తాజాగా ఈ సినిమా నుండి మోష‌న్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. అయితే ఎప్పుడూ గ్లామ‌ర‌స్ లుక్ లో క‌నిపించే అన‌సూయ ఈ పోస్ట‌ర్ లో మాత్రం విల‌న్ లుక్ లో క‌నిపిస్తోంది. చేతిలో త‌ల్వార్ ప‌ట్టుకుని జీబుపై వెలుతోంది. సీరియ‌స్ లుక్ లో క‌నిపిస్తున్న ఈ మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అయితే సునీల్ అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తూ ఉండ‌టంతో ఈ సినిమాపై ఆస‌క్తినెల‌కొంది. ఇదిలా ఉండ‌గా అన‌సూయ ప్ర‌స్తుతం ఖిలాడి సినిమాలోనూ న‌టిస్తోంది. ఈ సినిమాలో కూడా అన‌సూయ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading