Home » కేసీఆర్ ని ఓడించిన ఒకే ఒక్క వ్యక్తి… ఈయన గురించి ఈ విషయాలు తెలుసా?

కేసీఆర్ ని ఓడించిన ఒకే ఒక్క వ్యక్తి… ఈయన గురించి ఈ విషయాలు తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

కేసీఆర్.. ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ ధీరుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము కోసం ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిన ధీరుడిగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కారు. ఎన్నో పోరాటాలను చేసి.. ఎన్నో రాజకీయ పదవులను వదులుకున్న ఆయన జీవితంలో ఓటమి లేదని అందరు అనుకుంటూ ఉంటారు. అయితే.. రాజకీయ పరంగా ఆయన జీవితంలో కూడా ఓటమి ఉందన్న సంగతి అందరికీ తెలియదు. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా యాక్టివ్ గా మార్చాలన్న ఉద్దేశ్యంతో బిఆర్ఎస్ గా మార్చారు.

Advertisement

ఎప్పుడు గెలవడమే తప్ప ఓడిపోవడం తెలియని కేసీఆర్ చరిత్రలో కూడా ఒక ఓటమి ఉందట. ఇంతకీ కేసీఆర్ ను ఓడించిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. కేసీఆర్ పార్టిసిపేట్ చేసిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఓటమి పాలయ్యారట. తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవట. అందులో సిద్ధిపేట నియోజక వర్గం కూడా ఒకటి. 1983 సమయంలో అసెంబ్లి ఎన్నికలు వచ్చినపుడు సిద్ధిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేశారట.

Advertisement

అప్పటికే అనంతుల మదన్ మోహన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడు సిద్ధిపేట నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆయనకు పోటీగా టీడీపీ నుంచి కేసీఆర్ ను నిలబెట్టారట. ఇవే కేసీఆర్ కు మొట్టమొదటి ఎన్నికలు. అప్పటికే సిద్దిపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనన్తల మదన్ మోహన్ రెడ్డి సీనియర్ లీడర్ గా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల్లో సిద్ధిపేట నియోజక వర్గం వద్ద పోటీ చేసిన కేసీఆర్ మదన్ మోహన్ రెడ్డి మీద కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే ఆయన మొదటగా, చివరగా ఓడిపోవడం. ఆ తరువాత పదమూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి.. ఆయన ఎక్కడా ఓడిపోలేదు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading