Home » అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్.. ఫుడ్ మెనూలో 2500 రకాల వంటకాలు..!

అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్.. ఫుడ్ మెనూలో 2500 రకాల వంటకాలు..!

by Anji
Ad

సాధారణంగా సినీ, రాజకీయ, బిజినెస్ మేన్ వంటి సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ జరుగుతున్నాయంటే ప్రతీ విషయం కూడా ఓ ఆసక్తికరమనే చెప్పాలి. పెళ్లి ముహుర్తం నుంచి పెళ్లి జరిగేంత వరకు వాళ్లు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అపర కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంటే ఆ విశేషాలు మామూలుగా ఉండవు. అందుకే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక గురించి ప్రస్తుతం రోజుకొక వార్త బయటికీ వస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో అతిథులకు ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నారట.

Advertisement

ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరొకసారి రిపీట్ చేయకుండా ఆహ్వానితులకు విందు ఇవ్వనున్నట్టు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. జులై 12న  వీరి పెళ్లి జరగనుండగా.. మార్చి 01 నుంచి మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.  ఈ మూడు రోజుల పాటు అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.  డైట్ కి తగ్గట్టుగా ఫుడ్ అందుబాటులో ఉంచనున్నారు. జామ్ నగర్ లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో.. ఆల్ట్రా లగ్జరీ టెంట్ లను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

 

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి 21 మంది చెఫ్ లను పిలిపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలుసంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తం 2,500 వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు. బ్రేక్ పాస్ట్ లో 75 వెరైటీలు, లంచ్ లో 225, డిన్నర్ లో 275 రకాల వంటకాలను వడ్డించనున్నారు. మిడ్ నైట్ స్నాక్స్  కూడా ఏర్పాటు చేయనున్నారట. అర్థరాత్రి 12 నుంచి తెల్లవారుజామున  4 గంటల వరకు 85 వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అందించనున్నట్టు సమాచారం. కచోరీ, పోహా, జిలేబీ, భుట్టె కా కీస్, ఖోప్రా ప్యాటిస్ తదితర ఇందోరీ వంటకాలను ప్రత్యేకంగా చేయించనున్నారు.

Also Read :  7 రోజులపాటు దానిమ్మ తింటే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం!

Visitors Are Also Reading