Home » ఏంటి బ్రో.. అనందం హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది?

ఏంటి బ్రో.. అనందం హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది?

by Bunty
Ad

 

 

ఆనందం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేఖ వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి సక్సెస్, పేరును తన ఖాతాలో వేసుకుంది. జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, దొంగోడు, అనగనగా ఓ కుర్రోడు వంటి సినిమాలతో తెలుగు వారికి మరింత చేరువైంది ఈ బ్యూటీ. ఇక కొన్ని రోజులకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ సినిమాలలో నటించి అక్కడ స్టార్ హీరోయిన్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

Advertisement

Advertisement

చాలా కాలం తర్వాత ఈ అమ్మడు బుల్లితెర షో మీద అడుగుపెట్టింది. వేణు తొట్టెంపూడితో కలిసి షోలో పాల్గొంది. ఈ షోలో ఈ అమ్మడును చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. ముఖంలో కలంతా పోయి బక్కగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.ఆమెను చూసి నటి ఇంద్రజ సైతం షాక్ అయిపోయింది. మిమ్మల్ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాకుండా నిన్ను చూసి చాలా షాక్ అయ్యాను. మీరు చాలా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అని ఇంద్రజ చెప్పింది.

 

దీనికి రేఖా సమాధానంగా అనుకోకుండా అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చింది. ఆమె ఏదో మనసులో పెట్టుకొని ఏదో మాట్లాడినట్టు అందరికీ అనిపించింది. ఏదేమైనప్పటికీ ఏమైనా అనుకోని కారణాల వల్లే ఆమె ఇలా మారిపోయిందని కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా రేఖా వేదవ్యాస్ ఏదైనా కారణాలతో బాధపడుతున్నట్లు అయితే అవి తొందరగా తొలగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading