Home » ఆ గ్రూప్ మా అన్నయ్యను తొక్కేయాలని చూస్తోంది.. ఆనంద్ దేవరకొండ సంచలన కామెంట్స్..!

ఆ గ్రూప్ మా అన్నయ్యను తొక్కేయాలని చూస్తోంది.. ఆనంద్ దేవరకొండ సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

విజయ్ దేవరకొండ కి ప్రస్తుతం పెద్ద హిట్లు లభించట్లేదు సో సినిమాలు మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని వాదన కూడా ఉంది. ఫ్యామిలీ స్టార్ మూవీలో మరోసారి అది ప్రూవ్ అయింది. ఫస్ట్ షో నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇదంతా ఒక గ్రూప్ చేస్తోందని, విజయ్ దేవరకొండ ని తొక్కేయాలని చూస్తున్నారని ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లేటెస్ట్ మూవీ గం గం గణేశా మే 31న విడుదల కానుంది. ఈ క్రమంలో గం గం గణేష్ ట్రైలర్ ని విడుదల చేశారు.

family-star-movie

Advertisement

ఫ్యామిలీ స్టార్ మూవీ మీద నెగటివ్ ప్రచారానికి సంబంధించి ఒక ప్రశ్న ఆనంద్ కి ఎదురు అయింది. కేసు కూడా పెట్టారు కదా ఏమైందని విలేకరులు అడిగితే.. అందుకు స్పందించి ఆనంద్ సినిమా బాగుందని బాలేదని చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడంటే అర్థం ఉంది. కానీ ఒక గ్రూపుగా తయారయ్యి సినిమాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఫ్యామిలీ స్టార్ విడుదలకి 48 గంటల ముందు నుండి నెగటివ్ ప్రచారం మొదలైందని అన్నారు.

Also read:

Advertisement

Also read:

యూట్యూబ్ లో కూడా విజయ్ దేవరకొండ గత చిత్రాలను ప్రస్తావిస్తూ నెగిటివ్ ప్రచారాన్ని చేశారని ఇది సరికాదని, అన్నయ్య ఇటీవల రెండు మూడు కొత్త సినిమాలు ప్రకటించారు అవి ఫ్యాన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకుంటాయి. ఎంటర్టైన్ చేస్తాయి అని అన్నారు. పరోక్షంగా ఒక వర్గం విజయ్ దేవరకొండను తొక్కేయాలని చూస్తోందని ఆనంద్ అన్నారు. ఫ్యామిలీ స్టార్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు నెగిటివ్ ప్రచారం విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ విడుదలైన రెండు మూడు రోజులు వరకు రివ్యూ రాకుండా చూడాలని అప్పుడే సినిమా బతుకుతుందని ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. ఫ్యామిలీ స్టార్ పై తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు మండిపడ్డారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading