సాధారణంగా టెస్ట్ ల్లో.. వన్డేల్లో, టీ20లలో ఊచకోత చూడాలంటే కొన్ని సార్లు చాలా కష్టం. అయితే కొందరు బ్యాటర్లు ఫార్మాట్ ఏదైనా కూడా.. ఫస్ట్ బంతి నుంచి దంచికొట్టడమే అలవాటు. అలాంటి ఓ సీన్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో చోటు చేసుకుంది. ఈ సీజన్లో తొలుత తిలక్ వర్మ కెప్టెన్సీలో రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన హైదరాబాద్.. తొలి మ్యాచ్‌లో నాగాలాండ్‌పై అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో రాహుల్ సింగ్ సారథ్యంలో మేఘాలయను చిత్తు చేసింది. ఇక ముచ్చటగా మూడో మ్యాచ్‌లో సిక్కింపై 198 పరుగుల తేడాతో గెలుపొందింది.
Advertisement
Advertisement
ఇలా హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న హైదరాబాద్.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దంచికొట్టింది. సొంతగడ్డపై క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన హైదరాబాద్. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అరుణాచల్ ప్రదేశ్‌ను 172 పరుగులకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్‌కు.. ఆ జట్టు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, గహ్లోత్ రాహుల్ సింగ్ సంచలన ఆరంభాన్ని అందించారు. ఒకవైపు తన్మయ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగా.. మరోవైపు గహ్లోత్ 185 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తగ్గేదేలే అన్నట్టుగా తన్మయ్ మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
తొలి రోజు 160 బంతులు ఎదుర్కున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.. 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 పరుగులు చేశాడు. ఈ టీ20 తరహా ఇన్నింగ్స్‌కు హైదరాబాద్ మొదటి రోజు వికెట్ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. అటు రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగించిన తన్మయ్.. మొత్తంగా 181 బంతులు ఎదుర్కుని 34 ఫోర్లు, 26 సిక్సర్లతో 366 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్‌పై 437 పరుగుల లీడింగ్‌లో ఉంది హైదరాబాద్. కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డును.. ఇప్పుడు తన్మయ్ తన పేరిట లిఖించుకున్నాడు.