Home » Amy Jackson : ‘ఐ’ సినిమా హీరోయిన్‌.. ఇలా అయిపోయిందేంటి.. ఆ వ్యాధి సోకిందా?

Amy Jackson : ‘ఐ’ సినిమా హీరోయిన్‌.. ఇలా అయిపోయిందేంటి.. ఆ వ్యాధి సోకిందా?

by Bunty
Ad

Amy Jackson : స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ హీరో విక్రమ్ నటించిన ఐ సినిమాతో బాగా పాపులర్ అయింది హీరోయిన్ అమీ జాక్సన్. తెలుగు హీరోయిన్ కానప్పటికీ… మన రెండు తెలుగు రాష్ట్రాలలో అమీ జాక్సన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ప్రారంభంలో మోడల్గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమీ జాక్సన్… ఆ తర్వాత హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

amyjackosn photos

Advertisement

ఇక 2010 సంవత్సరంలో తమిళం లో ఒక సినిమా చేసి హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ అమీ జాక్సన్. ఆ తర్వాత 2014 సంవత్సరంలో ఎవడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది ఈ బ్యూటీ అమీ జాక్సన్. అయితే ఐ మనోహరుడు సినిమా తోనే హీరోయిన్ అమీ జాక్సన్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. అలాగే తెలుగులో అధినేత్రి సినిమా కూడా చేసింది ఈ బ్యూటీ.

Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ అమీ జాక్సన్ వింత గెటప్ లో కనిపించింది. జుట్టు పూర్తిగా కత్తిరించుకొని దర్శనమిచ్చిన హీరోయిన్ అమీ జాక్సన్… అసలు ఎవరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్స్ తమకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఐ సినిమాలో విక్రమ్ కు అన్యాయం చేసినందుకు… నీ మొఖం ఇలా మారిపోయింది అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading