Home » అమ్మానాన్న తమిళ అమ్మాయి మూవీకి సీక్వెల్..హీరోయిన్ ఎవరంటే..?

అమ్మానాన్న తమిళ అమ్మాయి మూవీకి సీక్వెల్..హీరోయిన్ ఎవరంటే..?

by Anji
Ad

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా పేరు చెప్తే తెలియని వారు ఉండరు. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ సినిమా సంచలన హిట్ పొందడమే కాకుండా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి మాస్ మహారాజ రవితేజ తన నటనతో ఓ రేంజ్ లో అదరగొట్టారని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రవితేజ సరసన హాట్ బ్యూటీ ఆసిన్ హీరోయిన్ గా చేసింది.

Advertisement

2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా సంచలనాలు సృష్టించింది. పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి పేరుతో దర్శకుడు మోహన్ రాజా తమిళంలో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. జయం రవి హీరోగా నటించిన పాత్రలో ఆసిన్ హీరోయిన్ గా చేసింది. జయసుధ పాత్రలో నదియా నటించింది. అలాంటి ఈ చిత్రం విడుదలై 15 సంవత్సరాలు గడిచిన తర్వాత దీనికి సీక్వెల్ గా సినిమా రాబోతుందట.

Advertisement

ఇదే విషయాన్ని మోహన్ రాజా ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రానికి సీక్వెల్ కచ్చితంగా వస్తుందని, సినిమా కాన్సెప్ట్ మొత్తం పూర్తయిపోయిందని, ఈ సినిమాలో జయం రవి హీరోగా నటిస్తున్నారని తెలుస్తోంది. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు కూడా డిసైడ్ కాలేదట. కానీ నదియా రోల్ మాత్రం ఈ సినిమాలో ఉండదని తెలుస్తోంది. కానీ తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాలో ఆసిన్ పాత్రలో రష్మిక మందాన చేస్తే బాగుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ చెప్పండి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading