అమ్మా రాజశేఖర్ ఆట డ్యాన్స్ షో లో జడ్జి గా వ్యహరించి ఆ షో ద్వారా ఎంతో మందికి పరిచయం అయ్యాడు. నిజానికి చాలా మంది కొరియోగ్రాఫర్ ఉంటారు కానీ టీవీ షోలలో కనిపించినవారే ప్రేక్షకులకు ఎక్కువగా తెలుస్తుంటారు. ఇక అమ్మారాజశేఖర్ టాలీవుడ్ లో అంజి, సై, కింగ్ లాంటి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. అంతే కాకుండా రణం అనే సినిమాకు దర్శకత్వం వహించి సూపర్ హిట్ అందుకున్నాడు.
Advertisement
ఆ తర్వాత తనే హీరోగా రణం 2ను తెరకెక్కించాడు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక ఇటీవల బిగ్ బాస్ లో సందడి చేశాడు. అయితే అక్కడ మాత్రం అమ్మా రాజశేఖర్ అమాయకుడు కన్నింగ్ వ్యక్తి అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా కొన్నివారాలకే ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు అమ్మా రాజశేఖర్ దర్శకుడిగా హై ఫై అనే మరోసినిమాకు దర్శకత్వం వహించాడు.
Advertisement
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఫంక్షన్ లో తాజాగా అమ్మా రాజశేఖర్ యంగ్ హీరో నితిన్ పై విరుచుకుపడ్డాడు. నితిన్ కు అసలు డ్యాన్స్ రాదని తానే నేర్పించానని చెప్పాడు. అంటే తను నితిన్ కు గురువుతో సమానం అని చెప్పాడు. ఇక తన సినిమా ఫంక్షన్ కు నితిన్ ను ఆహ్వనించానని కానీ రాలేదని చెప్పాడు.
నితిన్ షూటింగ్ కు కూడా వెళ్లలేదని ఇంట్లోనే ఉండి జ్వరం వచ్చిందని తనకు అబద్దం చెప్పాడని అన్నాడు. కనీసం వీడియో బైట్ అయినా ఇవ్వాలని కోరితే అది కూడా చేయలేదని అవేదన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు డ్యాన్స్ నేర్పించానని గురువు స్థానం లో ఉండి అడిగితే వాడు అలా చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతిఒక్కరికీ ఒకరోజు అంటూ వస్తుందని కామెంట్ చేశాడు.
ALSO READ : కృతిశెట్టి ఆ సినిమా విషయంలో చాలా ఇబ్బంది పడిందట.. ఎందుకో తెలుసా..?