సాధారణంగా ఉసిరి లో శరీరానికి కావాల్సిన అన్ని ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా శరీరానికి కావలసినటువంటి ఫైబర్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్, ఐరన్, పిండి పదార్థాలు ఒమేగా 3, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఉసిరిని తీసుకోవాలి. నిత్యం ఉసిరిని తినడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఉసిరి తినడం వల్ల శరీరానికి సీజనల్ వ్యాధులనుంచి రక్షణ ఉంటుంది. ఇంతమంది ఉసిరిని తినడానికి అసలు ఇష్టపడరు. అలాంటివారు ఉసిరితో స్వీటు చేసుకొని తినవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరితో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కావాల్సిన పదార్థాలు :
జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్, పొడి చక్కెర 1.5 స్పూన్, ఉసిరి రెండు కిలో గ్రాములు, చక్కెర 1.5కేజీ, చాట్ మసాలా 1.5 టేబుల్స్ స్పూన్.
Advertisement
Also Read : శ్రీదేవితో గొడవపడ్డ రాజమౌళి.. కన్నీళ్లు పెట్టుకున్న అతిలోకసుందరి..!
తయారు చేయు విధానం :
ఉసిరికాయ మిఠాయి చేయడానికి ముందు సిరిని శుభ్రంగా కడగాలి. ఇక ఆ తర్వాత కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. ఉడికించిన వాటిని ఓ మిశ్రమల తయారు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వాటిలో పంచదార చల్లి పొడి గుడ్డతో కప్పాలి. ఒకటి నుంచి రెండు రోజుల వరకు గుడ్డతో అలాగే కప్పి ఉంచండి. ఆ తర్వాత ఒక స్త్రైనర్ సహాయంతో ఆరబెట్టాలి. ఆ తర్వాత జీలకర్ర, పొడి చక్కెర, చాట్ మసాలా ఇది పదార్థాలను వేసి కలిపి మిఠాయిల్లా నిల్వ చేసుకోవచ్చు. ఇలా తినడం వల్ల తియ్యగా ఉండడంతో పాటు ఉసిరిలో ఉన్న పోషకాలన్నీ మనకు చేరుతాయి.
Also Read : కలబందలో ఉండే ఔషదగుణాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!