Home » ఐపీఎల్ కు పాకిస్తాన్ స‌వాల్‌.. ఎవ‌రు ఆడ‌తారో చూస్తామంటూ..!

ఐపీఎల్ కు పాకిస్తాన్ స‌వాల్‌.. ఎవ‌రు ఆడ‌తారో చూస్తామంటూ..!

by Anji
Ad

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ను (ఐపీఎల్‌) స‌వాల్ చేశాడు పాకిస్తాన్‌క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ రాజా. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో వ‌చ్చే ఏడాది నుంచి వేలం ప్ర‌క్రియ‌ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని అప్పుడు ఐపీఎల్‌లో ఎవ్వ‌రు ఆడ‌తారో చూస్తామని చెప్పాడు. ఇటీవ‌ల ఓ క్రీడా ఛానెల్‌తో కూడా వ్యాఖ్యానించాడు.


పీసీబీని ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డానికి సొంత ఆదాయ వ‌న‌రుల‌ను సృష్టించాలి. మావ‌ద్ద ప్ర‌స్తుతం పీఎస్ఎల్,ఐసీసీ నిధులు మాత్ర‌మే ఉన్నాయి. వ‌చ్చే ఏడాది నుంచి పీఎస్ఎల్‌లో వేలం విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావిస్తున్నాం. దీనిపై ప్రాంఛైజీల‌తో చ‌ర్చిస్తాం. పాకిస్తాన్ క్రికెట్‌కు ఆదాయం పెరిగితే.. మా గౌవ‌రం కూడా పెరుగుతుంది. పీఎస్ఎల్‌లో వేలం ప్ర‌క్రియ మొద‌లైతే ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు పీఎస్ఎల్‌ను దాటి వెళ్లి ఐపీఎల్‌లో ఎవరూ ఆడ‌తారో మేము చూస్తాం అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ రాజా పేర్కొన్నాడు.

Advertisement

Advertisement

పీఎస్ఎల్‌ను ఐపీఎల్ స్థాయికి తీసుకువెళ్లాలంటే డ్రాప్టింగ్ విధానం నుంచి వేలానికి మార్చాల‌ని ఆ దేశ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ కూడా సూచించాడు. అప్పుడే స్టార్ ఆట‌గాళ్లు ఈ టోర్నీ వైపు మొగ్గు చూపుతార‌ని చెప్పాడు.

Also Read :  ఫ్లాప్ టాక్ తో మొదలై బాలీవుడ్ ను షేక్ చేసిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా….!

 

Visitors Are Also Reading