పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి ఇచ్చిన సక్సెస్ తర్వాతా ఇప్పటికి రెండు సినిమాలలో నటించిన ప్రభాస్ కు అవి అనుకున్నంత సక్సెస్ అనేవి ఇవ్వలేకపోయాయి. అయిన వాటిని పాటించుకోకుండా ప్రభాస్ తన ముందు సినిమాలపైన ఫోకస్ అనేది చేస్తూ వెళ్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ చేస్తున్న సినిమాలో ప్రాజెక్ట్ కే ఒక్కటి.
Advertisement
వైజయంతి బ్యానర్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకునిగా ఉన్నాడు. అయితే ఈ సినిమాపైన అందరికి చాలానే అంచనాలు అనేవి ఉన్నాయి. కానీ ఈ సినిమాకు ఇంకా టైటిల్ అనేది ఫిక్స్ చేయలేదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా.. దీపికా పదుకొనె నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా అనేది ఎలా ఉండబోతుంది అనే విషయం మాత్రం తెలియలేదు.
Advertisement
కానీ తాజాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తాను ఎలా కనిపించబోతున్నాడు అనే విషయాన్ని బయటపెట్టాడు. ఈ ప్రాజెక్ట్ కే లో అమితాబ్ బచ్చన్ యొక్క పాత్ర మొత్తం మీసాలు, గడ్డలాతో ఉంటుంది అని ఆయనే ప్రకటించారు. అలాగే ఇలాంటి మీసాలు, గడ్డలు ఉన్న పాత్రలు చేయడం తనకు ఇష్తమ్ లేదు అని చెప్పిన అమితాబ్ బచ్చన్.. ప్రస్తుతం నాకు మొత్తం ఇలాంటి పాత్రలో వస్తున్నాయి. అందుకే చేస్తున్నాను అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :