Home » IT బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు… చంద్రబాబుపై అంబటి రాయుడు ఫైర్

IT బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు… చంద్రబాబుపై అంబటి రాయుడు ఫైర్

by Bunty
Ad

స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు గురించి తెలియని వారు ఉండరు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్ తో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మూడు నెలలకు క్రితమే తన పొలిటికల్ ఎంట్రీపై రాయుడు హింట్ కూడా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడిన రాయుడు తన రిటైర్మెంట్ ట్విట్ లో కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత రెండుసార్లు జగన్ ను కలిశారు.

Advertisement

ఒక ప్రముఖ తెలుగు ఛానల్ నిర్వహించిన టాక్ షోలో రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాయుడు చేసిన వాక్యాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. చాలా క్లారిటీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు రాయుడు చెప్పారు. తన ప్రాంతం అభివృద్ధి కోసమే రావాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఒక ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదని, అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్సిపి ప్రత్యర్థులకు చురకలు అంటించారు. ఇటీవల ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

దాని ఆధారంగా ఎన్నో ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉందని, ఎంతో అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఆ డెల్టా ప్రాంతాన్ని బంగారంగా చూడటమే తన ధ్యేయమని, యువకులు ఇంకా రాజకీయాల్లోకి రావాలని, అభివృద్ధి రెండు రకాలుగా ఉంటుందని, సోషల్ డెవలప్మెంట్ ఒకటైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటని, ప్రతి చోట ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదని…ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని, పేదవారు మన ఇంట్లో పని చేయాలనటం పద్ధతి కాదని, ప్రతి వర్గం ఎదగాలని ప్రతి మనిషి డెవలప్ కావాలని అదే తన లక్ష్యమని ఆ లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని రాయుడు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఒకే ఓవర్ లో 6 వికెట్లు… 12 ఏళ్ల కుర్రాడు చరిత్ర

సీఎం జగన్ పాలనపై టీమిండియా క్రికెటర్ ప్రశంసలు

Visitors Are Also Reading