Home » అమెజాన్ లో అద్భుత‌మైన ఆఫ‌ర్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ ఆఫ‌ర్..!

అమెజాన్ లో అద్భుత‌మైన ఆఫ‌ర్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ ఆఫ‌ర్..!

by Anji
Ad

అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌ల కోసం అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ ప్రారంభం అయింది. ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ క‌స్ట‌మ‌ర్ల‌కు అమెజాన్ ఆగ‌స్టు 05 అర్థ‌రాత్రి నుంచే ప్రారంభం అయింది.ఇక ఇత‌ర క‌స్ట‌మ‌ర్ల కోసం ఈ సేల్ ఆగ‌స్టు 06 నుంచి ప్రారంభ‌మైంది. ఈ సేల్ ఆగ‌స్టు 10 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ది. ఈసేల్ స‌మ‌యంలో అనేక ఉత్ప‌త్తులు త‌గ్గింపు పొంద‌వ‌చ్చు. ప‌లు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రానుంది. సేల్ స‌మ‌యంలో ప‌లు టీవీ మోడ‌ళ్ల‌పై 60 శాతం వ‌ర‌కు భారీ త‌గ్గింపు అందించ‌బడుతోంది. సేల్‌లో 32 అంగుళాల నుంచి 55 అంగుళాల వ‌ర‌కు ఉన్న టీవీ మోడ‌ళ్ల‌పై క‌స్ట‌మ‌ర్లు త‌గ్గింపు ప్ర‌యోజ‌నాన్ని పొందుతారు.

Advertisement

ఇక మొబైల్స్ పై 40 శాతం, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్ వంటి వాటిపై 75 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక ఈ సేల్‌లో భాగంగా యాపిల్ సంస్థ ఐఫోన్ -13ను రూ.11వేల త‌గ్గింపు ధ‌ర‌తో రూ.68,900కి, వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ 5 జీ ఫోన్ రూ.5వేల త‌గ్గింపుతో రూ.61,999కి, ఐక్యూ 9 ప్రొ 5 జీ ఫోన్ రూ.5వేల త‌గ్గింపుతో రూ.55, 990 ధ‌ర‌కు కొనుగోలు చేసేందుకు ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అదేవిధంగా Xiaomi 12 Pro రూ.5వేల త‌గ్గింపులో రూ.51,990 త‌దిత‌ర ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. Xiaomi 11 Lite NE 5G, OnePlus Nord CE 2 Lite 5G, Realme Narzo 50, Redmi Note 11 ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

ఇక ట్యాబ్‌లెట్‌ల‌పై కూడా 50 శాతం, కెమెరాలు, ప్రింట‌ర్లు, గేమింగ్ యాక్స‌స‌రీలు, స్పీక‌ర్లు, డేటా స్టోర్‌చేసే డివైజ్‌లు, హై స్పీడ్ రౌట‌ర్లు, కంప్యూట‌ర్ కాంపోనెంట్స్‌, సౌండ్ బార్స్, మానిట‌ర్స్, వైఫై స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ కెమెరాలు త‌దిత‌ర వాటిపై దాదాపు 45 నుండి 80 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక ఈ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డును ఉప‌యోగించి అద‌నంగా 10 శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. క‌స్ట‌మ‌ర్ల సౌల‌భ్యం కోసం ఎలాంటి వ‌డ్డీ లేకుండా ఈఎంఐ స‌దుపాయం అందుబాటులో ఉంటుంద‌ని అమెజార్ వెల్ల‌డించింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌తో కూడా రూ.5వేలు డిస్కౌంట్ ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం.

Also Read : 

పెళ్లికి ముందే ఎన్టీఆర్ కు ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి అన్ని కండిష‌న్స్ పెట్టిందా..? ఆ కండిష‌న్స్ ఏంటి..?

చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా…?

Visitors Are Also Reading