సాధారణంగా ఉసిరికాయలో అద్భుతమైన ఔషద గుణాలుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఉసిరికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పలు వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ప్రధానంగా ఉసిరి రసంలో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టిరియా నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రధానంగా శీతాకాలంలో ఈ ఉసిరికాయలు చాలా ఎక్కువగా లభిస్తుంటాయి. ఉసిరికాయ, తేనే కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. ఈ సీజన్ లో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉసిరి చాలా బాగా పని చేస్తుంది.
Advertisement
ఉసిరి కాయ, తేనె రెండింటిలో కూడా యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలతో పాటు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే గుణాలు వీటిలో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తేనెలో నానబెట్టిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పరగడుపున తింటే కాలేయం చాలా హెల్తీగా ఉంటుంది. జాండీస్ వంటి సమస్యను కూడా నివారిస్తుంది.
లివర్ లో చేరినటువంటి బైల్ పిగ్మెంట్, టాక్సిన్స్ ని తొలగిస్తుంది. కాలేయం మరింత చురుకుగా పని చేస్తుంది. తేనెలో నానబెట్టిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు లాంటిది.అంతేకాదు.. ఆకలిని పెంచడంలో సహాయం చేస్తుంది. జీర్ణక్రియను చాలా మెరుగుపరుచుతుంది. తేనెలో నానబెట్టిన ఉసిరి ద్రవాన్ని తాగడంతో మలబద్ధకం సమస్యతో పాటు ఫైల్స్ సమస్య నుంచి కూడా తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
Advertisement
Also Read : మనిషి నవ్వడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం మీకు తెలుసా..?
చలికాలంలో ప్రధానంగా దగ్గు, జలుబు, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వ్యాధులు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. అయితే ఈ వ్యాధులకు తేనె, ఉసిరికాయతో చెక్ పెట్టవచ్చు. శరీరంలో ఎక్కువగా పేరుకుపోయినటువంటి కొవ్వును కరిగించడంతో పాటు అధిక బరువు సమస్య ఉన్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం తేన ఉసిరికాయను తీసుకున్నట్టయితే చర్మంపై ముడతలు తగ్గి చాలా యవ్వనంగా కనిపిస్తారు.
Also Read : దిష్టి కోసం మీ పిల్లలకు నల్లదారం కడుతున్నారా..? ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి..!
ప్రధానంగా ఓ జార్ లో సగం వరకు తేనె పోసి దాంట్లో కడిగి ఆరబెట్టినటువంటి ఉసిరికాయలను వేయాలి. ఆ తరువాత మూత గట్టిగా పెట్టి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు జామ్ మాదిరిగా తయారవుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్ లోని తేనెతో కలిపి ఉదయం పరగడుపున తినాలి. ఇలా తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలుంటాయి.
Also Read : అరటి పండ్లు వంకరగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ?