స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ అల.. వైకుంఠపురంలో కాగా.. అదే సక్సెస్‌తో పాటు బెస్ట్ పెర్‌ఫార్మర్‌గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం పుష్ప దరైజ్ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప ద రూల్ రాబోతున్నది. తొలి భాగంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించిన ఫహద్ ఫాజిల్‌కు పుష్ప పాత్రధారి అల్లుఅర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు.
Advertisement
Advertisement
ఆ తరువాత ఏమవుతుంది..? అదే ఉత్కంఠతో ఉన్నారు ప్రేక్షకులు. ఆ ఉత్కంఠ కన్నా మిన్న అయిన ఆసక్తి కలిగించే అంశం మరొకటి వెలుగు చూసింది. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరొందిన సుకుమార్ పుష్ప మొదటి భాగంలో టాప్ హీరోయిన్ సమంతతోనే ఐటమ్ చేయించి కనువిందు చేశారు. ఊ అంటావా.. మావా అంటూ సాగే ఈ పాట అలా వచ్చీ రాగానే 100 మిలియన్ వ్యూస్ పట్టేసింది.
ఇప్పటి దాకా ఆ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఆ లెక్క ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అదే తీరున పుష్ప రెండవ భాగంలో కూడా మరొక ఐటమ్ సాంగ్ తెరకెక్కనున్నదట. అదే ఇప్పుడు అమితాసక్తి కలిగించే విషయం ఉంది. ఎందుకంటే పుష్ప రెండవ భాగంలో ఐటమ్ సాంగ్‌లో సమంతనే అల్లు అర్జున్‌తో చిందేయనున్నదట.
Also Read : VIDEO : బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిల ఫైటింగ్..వీడియో వైరల్..!