Home » ఇప్పటికే 20 సార్లు పెళ్లి చేసుకున్నాను.. అస్సలు బోర్ కొట్టలేదు.. అవికా గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఇప్పటికే 20 సార్లు పెళ్లి చేసుకున్నాను.. అస్సలు బోర్ కొట్టలేదు.. అవికా గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anji
Ad

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను అల‌రించి.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో కథానాయికగా తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బుల్లితెర న‌టి అవికాగోర్‌. ఈ సినిమాతో అవికా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత మ్యాన్షన్ 24  అనే వెబ్‌ సిరీస్‍తో ముందుకు వ‌చ్చింది అవికా.  ప్ర‌స్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ వ‌చ్చి నెల రోజులు కాకుండానే మ‌రో వెబ్ సిరీస్‌ను లైన్‌లో పెట్టింది. ప్రస్తుతం ఆమె న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వ‌ధువు’.

Advertisement

మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. పోలూరు కృష్ణ దర్శకత్వం వ‌హించాడు. బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే సిరీస్ సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ డిస్నీ+ హాట్‍స్టార్‌లో డిసెంబ‌ర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానున్న విష‌యం తెలిసిందే. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ సందర్భంగా సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న అవికా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.‘వధువు’ గురించి అవికా మాట్లాడుతూ.. థ్రిల్లర్‌ జానర్‌లో ఈ వెబ్ సిరీస్ రూపొందినట్లు వెల్లడించింది. బెంగాలీ సక్సెస్‌ ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఇందు’ను తెలుగులో ‘వధువు’గా తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Advertisement

కేవలం ప‌దేళ్ల వయసులో ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్​లో నటించాను. అప్పటికి పెళ్లంటే ఏంటో కూడా నాకు సరిగ్గా తెలిదు. డైరెక్టర్​ ఏం చెబితే అదే చేసేదాన్ని. ‘వధువు’ పేరుతో ఈ స్టోరీ రాగానే నాకు ‘చిన్నారి పెళ్లికూతురే మొద‌ట‌ గుర్తొచ్చింది. కానీ ఇది ఓ భిన్నమైన కథ. థ్రిల్లర్‌ కథగా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నలు ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటాయి.ఇక తనకు పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అంటే చాలా ఇష్టమని చెప్పింది అవికా. సీరియల్స్, సినిమాల్లో ఇప్పటి వరకు 20 సార్లకు పైగా పెళ్లి చేసుకోని ఉంటానని చెప్పింది.’ చిన్నారి పెళ్లి కూతురు’లో నటించడం వల్ల విషయాలు తెలుసుకున్నట్లు తెలిపింది. ‘వధువు’ కోసం పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చాలా సీన్లలో నేచురల్ గా నటించినట్లు వెల్లడించింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading