Home » బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు అదే రేంజ్ లో హిట్ అందుకున్న రాజశేఖర్ సినిమా ఇదే..!

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు అదే రేంజ్ లో హిట్ అందుకున్న రాజశేఖర్ సినిమా ఇదే..!

by Anji
Ad

టాలీవుడ్ లో అప్పటికే చాలా సినిమాలు మంచి సక్సెస్ లో ఆడుతున్నాయి. అప్పటికే నరసింహ నాయుడు విజయంతో ఉన్న బాలయ్యకి   డైరెక్టర్ సముద్ర  ఓ కథ చెప్పారట.  బాలకృష్ణ తరువాత చూద్దాంలే అని చెప్పారట. మదర్ సెంటిమెంట్ ను తన నుంచి అభిమానులు ఆదరిస్తారో లేదో అని బాలయ్య భావించాడట. ఇక ఆ తరువాత ఎవరైతే బాగుంటుందని దర్శక, నిర్మాతలు ఆలోచించిన తరువాత రాజశేఖర్ కి కథ వినిపించారట. ఇక రాజశేఖర్ ఫీలై కచ్చితంగా చేద్దామని చెప్పడంతో ఈ సినిమా పట్టాలపైకి ఎక్కింది.  ఆ సినిమానే సింహరాశి. దర్శకుడు సముద్ర, నిర్మాత ఆర్.బీ. చౌదరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ.

Advertisement

రాజశేఖర్ హీరోగా, సాక్షి శివానంద్ హీరోయిన్ గా గిరిబాబు, మనోరమ, విజయ్, ఎం.ఎస్. నారాయణ, అచ్యుత్ తదితర పాత్రల్లో నటించగా.. విలన్ గా ఆనంద్ రాజ్ అద్భుతమైన నటన కనబరిచారు. మదర్ సెంటిమెంట్ తో తల్లి పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ సినిమా మొత్తం ఆ ఫ్లాట్ లోనే ముందుకు వెళ్లేలా డైరెక్టర్ చాలా అద్భుతంగా ఈ సినిమాని సిద్ధం చేశాడు. ఒరిజినల్ మహికి తెలుగు వర్షన్ రీమెక్ అయిన సింహరాశికి చాలా మార్పులే జరిగాయి. హీరోయిజం డైలాగ్ లలో దర్శకుడు చాలా కొత్తగా చూపించాడు. తల్లి స్పర్శను పొందని బిడ్డ.. మరో ఆడదాని స్పర్శ ఎక్స్ పెక్ట్ చేయడం వంటి ఎమోషనల్ పాత్రలో  రాజశేఖర్ చాలా అద్భుతంగా నటించాడు.  ప్రతి ప్రేమలోను ఇతని నటన కంటే ఇంకొకరు కనిపించరు అంటే ఆ పాత్రను ఆయన ఎంతగా ఆవాహనం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్ కి పాత్ర నచ్చిందంటే ప్రాణం పెట్టేస్తారు. సింహరాశి సినిమాకి అలాగే చేశారు.

Also Read :  విడాకుల త‌ర‌వాత మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్ల‌కుండా సింగిల్ గా ఉంటున్న 8 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..! 

Advertisement

ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిందంటే కథతో పాటు రాజశేఖర్ నటనే కారణం అని దర్శకుడు సముద్ర చెప్పుకొచ్చాడు. సాక్షి శివానంద్, రాజశేఖర్ మధ్య ప్రేమ సీన్లు, రాజశేఖర్ ఎమోషనల్ అయ్యే సీన్లు సినిమాకి చాలా హైలెట్ గా నిలిచాయి. మట్టి పాత్రలో రాగి ముద్దలు తినడం, కలెక్టర్ ఆఫీస్ లో కింద కూర్చోవడం, ఎన్నో కోట్లు సంపాదించినా కటిక నేల మీదనే పడుకోవడం వీటన్నింటికి ఇతను ఇచ్చే ఫిలాసపి నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటాయి. తమిళంలో శరత్ కుమార్ చేసిన ఈ రేంజ్ లో నటించలేదనే చెప్పాలి. తమిళం కంటే ఈ సినిమా తెలుగులోనే భారీ విజయాన్ని సాధించింది. 2001 జులై 06న  సింహరాశి  విడుదలైంది. ఆ ఏడాది సంక్రాంతికి విడుదలైన నరసింహనాయుడు, ఏప్రిల్ లో విడుదలైన ఖుషి తరువాత ఆ స్థాయి విజయాన్ని దక్కించుకోవడం అది కూడా చాలా తక్కువ గ్యాప్ లోనే అవ్వడం గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పటికీ రాజశేఖర్ బెస్ట్ మూవీ అంటే సింహరాశి అనే చెప్పవచ్చు.

Also Read :  అల్లు అరవింద్ కు సంతానం నలుగురు అనే విషయం మీకు తెలుసా ?

ముఖ్యంగా క్లైమాక్స్ లో మనోరమ తల్లి లా రాజశేఖర్ ని టచ్ చేసినప్పుడు పలుకరించిన ఎమోషన్ చాలా అద్భుతం. అప్పటివరకు సన్యాసిలా గీత గీసిన రాజశేఖర్ ఒక్కసారిగా వాస్తవంలోకి వస్తూ అద్భుతమైన నటన తీరు కనబరిచారు. ఎస్.ఏ. రాజ్ సంగీతంలో వచ్చిన పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. కేవలం రూ. 5 కోట్లతో విడుదలైన ఈ సినిమాకి అన్ని పోను రూ.15 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువే. ఇలాంటి సినిమా చేయాలంటే కేవలం నటుడు అయితే సరిపోదు. నవరసాల్లో పూర్తిగా కలుగజేసుకొని దానిలో పూర్తిగా ఇనుమడింపజేయాలి. రాజశేఖర్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.  మొత్తానికి 2001లో బాలయ్య నరసింహనాయుడు,  పవన్ కళ్యాణ్ ఖుషి, వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్, రాజశేఖర్  సింహరాశి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయనే చెప్పవచ్చు.

Also Read : హిట్ చిత్రాలను నిర్మించే హోంబలే ఫిల్మ్స్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Visitors Are Also Reading