Home » పెళ్ళికి ముందు అల్లు రామలింగయ్య చిరంజీవిని సీక్రెట్ గా ఒక కంట కనిపెట్టేవారట ఎందుకంటే ?

పెళ్ళికి ముందు అల్లు రామలింగయ్య చిరంజీవిని సీక్రెట్ గా ఒక కంట కనిపెట్టేవారట ఎందుకంటే ?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్స్ గా ఎదిగిన ఎక్కువ మంది సినిమా బ్యాగ్రౌండ్ నుండి వ‌చ్చిన వాళ్లే. కానీ అతి త‌క్కువ మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి సినిమా ఇండ‌స్ట్రీలో రాణించారు. అలా రాణించిన‌వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు అన్న‌గారు ఎన్టీఆర్ అయితే మ‌రొక‌టి చిరంజీవి వీళ్లిద్ద‌రూ కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు.

Advertisement

చిరంజీవి ఇప్ప‌టికీ కుర్ర‌హీరోల‌తో పోటీప‌డి సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా చిరు గాడ్ ఫాద‌ర్ సినిమాతో సూప‌ర్ హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉంటే చిరు సొంత‌కాళ్ల పై ఎదిగిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌క్సెస్ లో అల్లు రామ‌లింగ‌య్య పాత్ర కూడా ఉంది అన్న నిజం చాలా మందికి తెలుసు. ఒక‌ప్ప‌టి నిర్మాత క‌మెడియ‌న్ అల్లు రామ‌లింగ‌య్య చిరంజీవిని అల్లుడిగా చేసుకున్నారు.

Advertisement

అయితే అల్లు రామ‌లింగ‌య్య అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో టాప్ స్థానంలో ఉన్నారు. చిరు అప్పుడ‌ప్పుడే సూప‌ర్ హిట్ లు అందుకుని స్టార్ గా ఎదుగుతున్నారు. అలాంటి స‌మ‌యంలో అల్లు రామ‌లింగ‌య్య త‌న కూతురు సురేఖ‌ను చిరంజీవికి ఇచ్చి వివాహం జ‌రిపించారు. ఆ త‌వ‌రాత అల్లు అర‌వింద్ చాలా సినిమాల‌ను చిరంజీవితోనే నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే చిరంజీవిని అల్లు రామ‌లింగయ్య అల్లుడుగా చేసుకునేముందు కొన్ని ఆస‌క్తిక ఘ‌ట‌న‌లు కూడా చోటు చేసుకున్నాయట‌.

చిరును అల్లుడిగా చేసుకోవాల‌నుకున్న అల్లు రామ‌లింగ‌య్య మొద‌ట చిరంజీవి గురించి తెలుసుకోవాల‌ని త‌న కుమారుడు నిర్మాత అల్లు అర‌వింద్ కు చెప్పార‌ట‌. దాంతో అల్లు అర‌వింద్ చిరంజీవి తో సినిమాలు చేసిన న‌టీన‌టులు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వ‌ద్దకు వెళ్లి ఆరాతీశార‌ట‌. అల్లు అర‌వింద్ చిరు గురించి అడిగిన‌వాళ్లంతా చాలా మంచివాడు అని చెప్ప‌డంతో అల్లు రామ‌లింగయ్య చిరు కుంటుంబంతో సంబంధం కుదుర్చుకుని వివాహం జ‌రిపించారు.

Visitors Are Also Reading