ప్రస్తుతం మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ అనేది నడుస్తునా విషయం తెలిసిందే. మొదట్లో మల్టీ స్టారర్ సినిమాలు బాగానే వచ్చినా.. మళ్ళీ మధ్యలో అవి ఆగిపోయాయి. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాల సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఈ మధ్యే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేసిన విషయం తెలిసిందే.
Advertisement
అయితే ఈ ఐదారు హీరోలు కలిసి చేస్తారు అని ఎవరు ఉహించి కూడా ఉండరు. కానీ రాజమౌళి దానిని చేసి చూపించాడు. ఇక ఇదే క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా కలిసి సినిమా చేస్తారా అనేది ఎవరు ఊహించలేకపొతున్నారు. కానీ దానిని ముందే ఉహించి టైటిల్ కూడా ఫిక్స్ చేసారు నిర్మాత అల్లు అరవింద్.
Advertisement
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నాకు చరణ్, బన్నీ కలిసి చేస్తే చూడాలని ఉంది. వారు ఎప్పటికైనా కలిసి చేస్తారు అనే నమ్మకంతో అర్జున్ – చరణ్ అనే టైటిల్ కూడా నేను రిజిస్టర్ చేసి పెట్టుకున్నాను. ప్రతి ఏడాది దానిని రెన్యూవల్ చేస్తూ వస్తున్నాను అని అల్లు అరవింద్ చెప్పారు. అయితే ఈ మల్టీ స్టారర్ ను జనాల ముందుకు ఏ డైరెక్టర్ తెస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి :