సాధారణంగా మన తెలుగు హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం అభిమానులు కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోలకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే థియేటర్ల వద్ద పండగే. భారీ కటౌట్స్, పాలభిషేకాలతో నానా హంగామా చేస్తుంటారు. తమ హీరోను చూస్తే చాలు అనుకుంటారు. ఇక మరికొంతమంది తమ ఫేవరేట్ హీరోను కలవాలని ఎన్నో కలలు కంటారు. తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లు హీరోలను కలిసేందుకు పాదయాత్రలు చేస్తుంటారు. ఇక సైకిల్స్ పై కొన్ని వందల కిలోమీటర్స్ దాటి వస్తుంటారు. తమ ఫేవరేట్ హీరోలను కలిసి ఎంతో సంతోషపడిపోతారు. ఇక కొందరు అభిమాన తారలను చూసి భావోద్వేగానికి గురవుతారు. తాజాగా ఓ అభిమాని కూడా అల్లు అర్జున్ ను కన్నీరు మున్నీరయ్యాడు. బన్నీని హగ్ చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
చాలా కాలంగా తనను కలిసేందుకు ప్రయత్నిస్తున్న ఓ అభిమానని శుక్రవారం తన నివాసంలో కలిశాడు బన్నీ. తన ఇంటికి వచ్చిన అతడిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించాడు. తన అభిమాన హీరోను దగ్గరుండి చూసి.. అద్భుతమైన అవకాశం కల్పించడంతో ఆ కుర్రాడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. బన్నీ చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన అభిమాన హీరోను పట్టుకుని బోరున విలపించాడు. దీంతో ఏడుస్తున్న అభిమానిని ఓదార్చాడు బన్నీ. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానికి ధైర్యం చెప్పి అతడితో కాసేపు మాట్లాడాడు బన్నీ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. బన్నీ చేసిన పనికి అభినందిస్తున్నారు నెటిజన్స్.
A heartfelt moment captured! ❤️
Witness the touching moment as a diehard fan meets his idol @alluarjun for the first time. Emotions overflow as comforting words and a handshake create memories to last a lifetime.#AlluArjun pic.twitter.com/RS4NalS3kq
— All India Allu Arjun Fans & Welfare Association (@AIAFAOnline) March 15, 2024
Also Read : ఆమెను కలవడం సంతోషంగా ఉంది.. ఉపాసన పోస్ట్ వైరల్