Home » రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ అదిరిపోయే గిప్ట్..! 

రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ అదిరిపోయే గిప్ట్..! 

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన కొద్ది రోజుల కిందటే పేరెంట్స్ క్లబ్ లో చేరిపోయిన విషయం తెలిసిందే. అయితే తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుర్తింపుగా ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ తరువాత ఘనంగా బారసాల చేసి మెగా ప్రిన్సెస్ కి క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లింకార ఆలనా పాలనలోనే బిజీగా ఉంటుంది ఉపాసన. మరోవైపు రామ్ చరణ్ మాత్రం తిరిగి మళ్లీ షూటింగ్ లో బిజీగా అయిపోయాడు. కొద్ది కిందట యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూతురు కోసం గోల్డ్ డాలర్స్ ని బహుమతిగా ఇచ్చిన విషయం విధితమే. 

Advertisement

Advertisement

 

ఇక అంతకుముందే శర్వానంద్ కూడా మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ గిప్ట్ పంపించినట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొణిదెల వారసురాలుకి అదిరిపోయే కానక ఇచ్చారట. తన మేడ కోడలు కోసం ఏకంగా బంగారు పలకు బహుమతిగా ఇచ్చాడట అల్లు అర్జున్. అయితే ఆ పలక మాత్రం రాసుకునేది కాదట. క్లింకార పేరు, పుట్టిన తేదీ తదితర వివాలను వచ్చేవిధంగా పలకపై బంగారు అక్షరాలతో స్పెషల్ డిజైన్ చేయించిందట.బన్నీ ఇచ్చిన గిప్ట్ ని చూసి రామ్ చరణ్ దంపతులు కూడా తెగ మురిసిపోయారట.

 

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఏది చేసినా ట్రెండింగ్ అని అతని అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.  ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. ఫస్ట్ పార్ట్ తో ఎంతటి సంచలన విజయాన్ని సాధించాడో అందరికీ తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 

Visitors Are Also Reading