సినిమాల్లో నటించినన్ని రోజులు కొంతమంది కథానాయికలు వారి అందచందాలతో ఆకట్టుకుంటారు. ఇక అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరమయ్యాక కొంత మంది నటీమణుల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. సినిమాల్లో ఎంత బ్యూటీ నెస్ చూపించారో అంత దారుణంగా రకరకాల వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన షీలా పరిస్థితి ఇలాగే తయారైంది. ఆమె ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించినా కానీ కొద్ది సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది.
మొదట్లో ఆమె సోలో హీరోయిన్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన తర్వాత రెండవ హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించారు. అలాంటి కథానాయిక ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారు..?సీతాకోకచిలుక సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన షీలా ఆ మూవీ అంతగా హిట్ అవకపోవడంతో షీలాకు అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమా “రాజు భాయ్” మంచు మనోజ్ హీరోగా అందరినీ అలరించింది.
Advertisement
Advertisement
తర్వాత షీలా అల్లు అర్జున్ తో పరుగు సినిమా చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. తర్వాత వరుసగా అదుర్స్, మస్కా మూవీస్ లో నటించి మంచి పేరు సంపాదించింది. ఇక దీని తర్వాత నటీమణుల మధ్య తీవ్రంగా పోటీ ఏర్పడడంతో షీలా మూవీస్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది. కానీ ఆ వ్యాధి ఉన్న ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ బయట పెట్టలేదు. అయినా కూడా సినిమాల్లో నటించింది.
ఆమె తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలు చేసి ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ ను తీసుకుందట. అయితే ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో కొట్టుమిట్టాడుతోందని సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నారు. అంతటి స్టార్డమ్ సంపాదించిన షీలా ప్రస్తుతం ఒక సూపర్ మార్కెట్ పెట్టుకొని నడిపిస్తుందని తెలుస్తోంది. ఆమె ఇతరులను సాయం అడగటం ఇష్టంలేక ఈ విధంగా తన కాళ్ళపై తాను నిలబడిందని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెబుతున్నారు.
ALSO RAED;
ప్రేమ గురించి హీరోయిన్ సాయిపల్లవి ఏమన్నదో తెలుసా..?
ధావన్ ను ఇంకా ఏం చేయమంటారు చెప్పండి…?