Home » అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క విషయం వల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందా? అదేంటంటే?

అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క విషయం వల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందా? అదేంటంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

త్రివిక్రమ్ దర్శకత్వం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి సినిమా “జులాయి”. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనకి తెలుసు. అలాగే ఈ డైరెక్టర్, హీరో కాంబో కూడా సూపర్ హిట్ అయ్యింది. వీళ్ళ డైరెక్షన్ లో సన్ అఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు కూడా వచ్చాయి. ఇవి కూడా సూపర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన హీరో, డైరెక్టర్లుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ లు నిలిచారు.

Advertisement

ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, నివేదా పేతురాజ్, సముద్రఖని, మురళి శర్మ, జయరాం, సుశాంత్, నవదీప్ లు కీలకపాత్రలు పోషించారు. ఫుల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న అలా వైకుంఠపురంలో 2020 సంక్రాంతికి విడుదల అయ్యింది. మొదటి ఆట నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో రికార్డు కలెక్షన్స్తో దూసుకెళ్లింది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్, పాటలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి.

ALLU ARJUN

Advertisement

అసలు ఈ సినిమా స్టోరీ చెప్పగానే అప్పటికే త్రివిక్రమ్ తో హిట్స్ కొట్టి ఉండడంతో అల్లు అర్జున్ నమ్మకంగా ఒకే చెప్పేశాడట. అయితే.. షూటింగ్ మొదలు అయిపోయాక.. సెకండ్ హాఫ్ చాలా ఫ్లాట్ గా వెళ్లిపోవడం అల్లు అర్జున్ గమనించాడు. మొదట పట్టించుకోకపోయినా.. సెకండ్ హాఫ్ మరీ ప్లైన్ గా ఉండడంతో ఈ విషయాన్నే త్రివిక్రమ్ కు చెప్పారట. దీనితో త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై వర్క్ చేసి, చాలా వరకు కథని మార్చేసారట. కొన్ని కొత్త సన్నివేశాలను కూడా రాసుకున్నారట. వీటి వల్లే ఈ సినిమా ఇంత హిట్ అయ్యిందని, ఒకవేళ అల్లు అర్జున్ చెప్పకుంటే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Visitors Are Also Reading