Home » బ‌న్నీ దృష్టిలో వీరే బెస్ట్ డ్యాన్స‌ర్స్‌…

బ‌న్నీ దృష్టిలో వీరే బెస్ట్ డ్యాన్స‌ర్స్‌…

by Bunty
Ad

అల్లు అర్జున్ పుష్ప ది రైజింగ్ పార్ట్ 1 కోసం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. తెలుగు, త‌మిళ్‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, హిందీ బాష‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకోసం బన్నీ భారీ ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.

ఈ ఈవెంట్‌కోసం అభిమానులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. తెలుగు త‌రువాత బ‌న్నీ చెన్నై వెళ్లారు. అక్క‌డ ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. ప్రెస్ మీట్‌లో జ‌ర్న‌లిస్టులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌న్నీ స‌మాధానం చెప్పారు. బేసిగ్గా బన్నీ మంచి డ్యాన్స‌ర్ ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ దిశ‌గానే జ‌ర్న‌లిస్టులు బ‌న్నీని ప్ర‌శ్న‌లు అడిగారు. త‌మిళ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్స‌ర్ ఎవ‌రు అని ప్ర‌శ్నించిగా… క‌మ‌ల్‌హాస‌న్‌, విజ‌య్‌, ధ‌నుష్‌, శింబు, శివ‌కార్తికేయ‌న్‌ను బెస్ట్ డ్యాన్స‌ర్స్ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇక అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా డిసెంబ‌ర్ 17 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.

Advertisement

Visitors Are Also Reading