Home » మ‌రొక వివాదంలో అల్లుఅర్జున్‌.. సెటైర్ మిస్ ఫైర్

మ‌రొక వివాదంలో అల్లుఅర్జున్‌.. సెటైర్ మిస్ ఫైర్

by Anji
Ad

పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే అనుకోకుండా ఆయ‌న వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పుష్ప సినిమాలో పుష్ప‌రాజ్ పాత్ర స్మ‌గ్ల‌ర్ కావ‌డంతో సినిమా విడుద‌లైన నెల త‌రువాత ఆయ‌న‌ను విమ‌ర్శించే ఇప్పుడు అనుకోకుండా ఓ యాడ్ కార‌ణంగా వివాదంలో చిక్కుకున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో క్రేజీ ఉన్న న‌టుల‌ను త‌మ బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకోవ‌డం కంపెనీల సంప్ర‌దాయంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. క్రేజీ ఉన్న హీరోలు, హీరోయిన్‌లు అంద‌రూ ఈ విష‌యాన్ని క్యాష్ చేసుకుంటుంటారు.

Advertisement

Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశివారు బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

అయితే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ త‌న సొంత బ్రాండ్‌ను క్రియేట్ చేసుకునే ప‌నిలో ఉండ‌డ‌మే కాక అనేక ఎన్నో ఇత‌ర బ్రాండ్స్‌కు ఇత‌ర బ్రాండ్స్‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. పుష్ప పాన్ ఇండియా చిత్రం ద్వారా ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేసిన ఆయ‌న సినిమా విడుద‌ల ముందు ఓ బ్రాండ్‌కు యాడ్ చేసి చిక్కుల్లో ప‌డ్డారు. బ‌న్నీ రాపిడో బైకును పొగుడుతూ ఆర్టీసీని కించ‌ప‌రుస్తూ చేసిన ఒక యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో పాటు కోర్టును ఆశ్ర‌యించడంతో యాడ్‌ను నిలిపివేయాల్సి వ‌చ్చింది. కొన్ని రోజుల‌కు ఇప్పుడు మ‌రొక వివాదంలో చిక్కుకున్నారు.

Advertisement

ప్ర‌ముఖ ఫుడ్ సంస్థ జొమాటోకు అల్లుఅర్జున్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ త‌రుణంలోనే జొమాటో కోసం అల్లుఅర్జున్ ఓ యాడ్ చేయ‌డా.. దానిని ఇప్పుడు విడుద‌ల చేశారు. ఈ యాడ్‌లో భాగంగా అల్లుఅర్జున్ న‌టుడు సుబ్బ‌రాజుతో ఫైట్ చేస్తూ ఆయ‌న‌ను కొడ‌తాడు. దీంతో సుబ్బ‌రాజు గాల్లో తేల‌తాడు. గాల్లో తేలుతున్న సుబ్బ‌రాజు, న‌న్ను తొంద‌ర‌గా కిందికి దించుతూ నేను గోంగూర మ‌ట‌న్ తినాలి లేదంటే. హోట‌ల్ మూసేస్తారు అని అడుగుతారు.

దానికి ఇది సౌత్ సినిమా క‌దా గాల్లో ఎక్కువ సేపు ఎగ‌రాలి అంటూ ఎప్పుడు ఏమి కావాల‌న్నా జొమాటో ఉంది క‌దా అని బ‌న్ని చెబుతాడు. ఏమి కావాల‌న్నా, జొమాటో అందిస్తుంద‌ని సూప‌ర్ ఫాస్ట్‌గా మ‌న‌సు కోరితే త‌గ్గేదేలే అంటూ పుష్ప స్టైల్‌లో బ‌న్నీచెప్ప‌డంతో యాడ్ ముగుస్తుంది. ఈ యాడ్‌పై ఆయ‌న అభిమానులు ప్ర‌శంసిస్తుంటే.. సౌత్ సినీ ల‌వ‌ర్స్ మాత్రం అల్లుఅర్జున్ వీడియోపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సాధార‌ణంగా సౌత్ అంటే నార్త్ వాళ్ల‌కు చిన్న చూపు ఉంటుంది. వాళ్లు హేళ‌న చేస్తుంటారు. అలాంటి త‌రుణంలోనే బాహుబ‌లి, పుష్ప వంటి సినిమాల‌తో వాళ్ల‌కు స‌రైన స‌మాధానం చెబుతున్నా.. ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీని చిన్న‌బుచ్చే విధంగా కామెంట్ ఎలా చేయ‌గ‌లిగార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read :  అవెన్‌లో వీటిని అస్స‌లు వండ‌కూడ‌ద‌ట‌..!

Visitors Are Also Reading