Home » అల్లు అర్జున్ “పుష్ప” ట్రైల‌ర్ వ‌చ్చేసింది..!

అల్లు అర్జున్ “పుష్ప” ట్రైల‌ర్ వ‌చ్చేసింది..!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ప‌. క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో ఆర్య‌, ఆర్య‌-2 సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఈ రెండు సినిమాలు ప్రేమ క‌థ‌లు…కానీ పుష్ప మాత్రం మాస్ ఓరియంటెడ్ సినిమాగా రాబోతుంది. అల్లు అర్జున్ గ‌తంలో ఎప్పుడూ చేయ‌ని పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్ గా ఈ సినిమాలో క‌నిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టించ‌గా విల‌న్ గా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టించాడు.

Advertisement

Pushpa trailer

Pushpa trailer

అంతే కాకుండా సునీల్ కూడా ఈ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టించాడు. మ‌రోవైపు జ‌బ‌ర్ద‌స్థ్ బ్యూటీ అన‌సూయ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర‌లో న‌టించింది. ఇప్ప‌టికే బన్నీ ఇత‌ర న‌టీన‌టుల ఫోటోలు విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతే కాకుండా ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు పాట‌లకు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ కు మిలియ‌న్ల కొద్దీ వ్య్వూవ్స్ రావ‌డంతో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర బృంధం విడుద‌ల చేసింది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకునే విధంగా ఉంది.

Advertisement

Visitors Are Also Reading