Home » అల్లరి నరేష్ మామూలోడు కాదు…ఏకంగా 50 మంది హీరోయిన్లతో ?

అల్లరి నరేష్ మామూలోడు కాదు…ఏకంగా 50 మంది హీరోయిన్లతో ?

by Bunty
Ad

అల్లరి నరేష్ ఇతని పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇతను చేసే సినిమాలు అంటే ప్రేక్షకులు అందరికీ మహా పిచ్చి. ఇతని సినిమాలు చూస్తూ ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకుంటారు. ఇండస్ట్రీలో అల్లరి నరేష్ కొత్త డైరెక్టర్లకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు. దాదాపు అల్లరి నరేష్ 37 మంది డైరెక్టర్లను తన సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పటివరకు అల్లరి నరేష్ తన కెరీర్లో 60కు పైగా సినిమాలు చేశారు.

Advertisement

అంతేకాకుండా అల్లరి నరేష్ ఇప్పటివరకు 47 మంది కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అల్లరి నరేష్ స్టార్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ కుమారుడు. ఇతను సినీ ఇండస్ట్రీలో తన తండ్రి పేరును ఏమాత్రం వాడుకోకుండా తన టాలెంట్, నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్లలో అల్లరి నరేష్ ఒకరిగా ఉన్నారు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ప్రస్తుతం అల్లరి నరేష్ తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి, కామెడీ సినిమాలు కాకుండా యాక్షన్ సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.

ALLARI NARESH

ALLARI NARESH

ఒక సంవత్సరంలో దాదాపు మూడు లేదా నాలుగు సినిమాలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమాతో వస్తూనే ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అల్లరి నరేష్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువమంది డైరెక్టర్లను, హీరోయిన్లను పరిచయం చేసిన ఒక మంచి హీరోగా అల్లరి నరేష్ మంచి పేరుని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ “సభకు నమస్కారం” అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading