ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్… మొదటి సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నారు బన్నీ. ఇక గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా బంపర్ హిట్ కొట్టడమే కాకుండా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ దశలో ఉంది. ఇక పుష్ప సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఇటీవల వచ్చింది. ఈ జాతియ అవార్డు రావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేందుకు సిద్ధమయ్యారట.
Advertisement
Advertisement
ప్రస్తుతం పుష్ప రెండవ భాగం సినిమా కోసం దాదాపు 100 కోట్లు తీసుకుంటున్నారట అల్లు అర్జున్. అయితే ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడు తో సినిమా చేసిన 125 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నారట. జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యం లోనే అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారట. కాగా… పుష్ఫ 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి
పోసాని కృష్ణమురళికి రూ.5 లక్షలు అప్పు ఇచ్చిన అల్లు అర్జున్ !
“భోళా శంకర్” అట్టర్ ప్లాఫ్..భారీగా రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరంజీవి ?
Chiranjeevi : “ది ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ను రిజెక్ట్ చేసిన చిరంజీవి..?