Home » మెగా ప్రిన్సెస్​ క్లీంకారకు బన్నీ స్పెషల్ గిఫ్ట్…?

మెగా ప్రిన్సెస్​ క్లీంకారకు బన్నీ స్పెషల్ గిఫ్ట్…?

by Bunty
Ad

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ జంట ప్రస్తుతం హాట్ టాపిక్ గా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక వీరు పెళ్లయిన 11 సంవత్సరాలకి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ పాపకు “క్లింకారా” అనే పేరుని నామకరణం చేశారు. ఇక వీరికి పాప పుట్టినప్పటినుంచి అదృష్టం కలిసి వస్తుందని తెగ సంబర పడిపోతున్నారు మెగా కుటుంబ సభ్యులు. ఇక క్లింకారా కోసం ఇంట్లో చాలా మార్పులు చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ మధ్యలోనే క్లింకారా బారసాల ఘనంగా జరిపించారు. రామ్ చరణ్ గారాలపట్టికి విలువైన బహుమతులు చాలా వచ్చాయి. ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఎన్టీఆర్… చెర్రీ కూతురు కోసం బంగారంతో తయారు చేసిన డాలర్ ను అద్భుతంగా డిజైన్ చేయించి గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇక తాజాగా అల్లు అర్జున్ క్లింకారాకు ఒక అద్భుతమైన బహుమతిని పంపించాడట. అల్లు అర్జున్ బంగారు పలకను తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చాడట.

Advertisement

బంగారంతో పలక ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. ఆ బంగారు పలకపై క్లింకారా పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా ఆ పలకపై డిజైన్ చేయించారట. ఇక అల్లు అర్జున్ ఐడియా చాలా కొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అల్లు కుటుంబం, కొనిదెల కుటుంబం మధ్య గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ గొడవలు ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్య ప్రేమాభిమానాలు చాటుకుంటారు ఇరు కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

RCB : ఆర్‌సీబీకి కొత్త కోచ్‌.. వారిద్దరిపై వేటు..ఇక కప్ నమ్ దే

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

వెస్టిండీస్‌తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌!

Visitors Are Also Reading