Home » పోసాని కృష్ణమురళికి రూ.5 లక్షలు అప్పు ఇచ్చిన అల్లు అర్జున్ !

పోసాని కృష్ణమురళికి రూ.5 లక్షలు అప్పు ఇచ్చిన అల్లు అర్జున్ !

by Bunty
Ad

 

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ చాలా మంచివాడని… తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి వెల్లడించారు. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం పై పోసాని కృష్ణమురళి స్పందించారు. బన్నీ చాలా మంచివాడు అని ఓసారి నాకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎందుకని అడగ్గా మీరు మంచి పనులకే ఈ డబ్బు ఖర్చు పెడతారని తెలిసే… ఇచ్చానని అల్లు అర్జున్ చెప్పినట్లు పోసాని వివరించారు.

Advertisement

ఆ డబ్బులు ఆర్థిక స్తోమత లేక చదువు ఆపేసిన ముగ్గురికి లక్షన్నర చొప్పున ఇచ్చానని… మిగిలిన డబ్బులు వారికే బట్టలు కొనుక్కోమని ఇచ్చానని వెల్లడించారు. బన్నీకి థాంక్స్ చెప్పమన్నా అని గతంలో జరిగిన సంఘటన పోసాని గుర్తు చేశారు. నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించామని.. నాటకాలకు 115, ఉత్తమ పుస్తకాల క్యాటగిరీలో 3 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. సెప్టెంబర్ 7-18 వరకు స్క్రూటినీ జరుగుతుందని. 19వ తేదీ వరకు అవార్డుల ప్రకటన చేస్తామని పోసాని వెల్లడించారు.

Advertisement

అవార్డుల ఎంపికలో పూర్తి పారదర్శకత అన్నారు. ఏపీలో ఉన్న కళాకారులకు ఐడీ కార్డులు ఇవ్వటానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అనుమతి ఇచ్చారరి స్పష్టం చేశారు. జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్లకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నామని… ప్రభుత్వం వైపు నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కళాకారుల డేటా బేస్ తయారు చేస్తామని ప్రకటించారు. అవకాశాలు డైరెక్ట్‌గా అంది పుచ్చుకునే అవకాశం వస్తుందన్నారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.

ఇవి కూడా చదవండి 

“భోళా శంకర్” అట్టర్‌ ప్లాఫ్‌..భారీగా రెమ్యూనరేషన్‌ తగ్గించుకున్న చిరంజీవి ?

Chiranjeevi : “ది ఫ్యామిలీ మ్యాన్‌” వెబ్‌ సిరీస్‌ను రిజెక్ట్‌ చేసిన చిరంజీవి..?

Vijay Deverakonda : టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..?

Visitors Are Also Reading