ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప 2. గత ఎడదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యింది. కానీ విదేశాల్లో కూడా ఈ సినిమా హల్ చల్ సృష్టించింది. పుష్ప సినిమాపై సౌత్ లో భారీ అంచనాలు ఉన్నా.. హిందీలో మాత్రం పెద్దగా అంచనాలు లేవు.
Advertisement
కానీ సినిమా విడుదల తర్వాత పుష్ప హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. భారీగా కలెక్షన్స్ అనేవి అందుకుంది.ఈ సినిమాలోని పాటలు అయితే ఇప్పటికి ఫోన్స్ లో మోగుతూనే ఉన్నాయి. పుష్ప ఇంత పెద్ద విజయం అనేది సాధించడం వల్ల అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగింది. అయితే ఈ పుష్ప సినిమాపై తాజాగా అల్లు అర్జున్ కొన్ని కామెంట్స్ చేసాడు.
Advertisement
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప సినిమా ఇంత పెద్ద విజయం అనేది అందుకుంటుంది అని నేను అనుకోలేదు. ఈ విజయం చూసి నేను ఆశ్చర్యపోయాను. అయితే ఒకవేళ ఈ పుష్ప సినిమా అనేది నేను చేయకుంటే.. ఇప్పుడు ఈ సినిమా వల్ల నాకు దక్కిన అభిమానుల ప్రేమను సంపాదించడానికి నాకు మరో 20 ఏళ్ళు పట్టేది అని అల్లు అర్జున్ కామెంట్స్ చేసాడు.
ఇవి కూడా చదవండి :