Home » అల్లు అర్జున్ వల్ల పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్.. అసలు ఏమైందంటే..?

అల్లు అర్జున్ వల్ల పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్.. అసలు ఏమైందంటే..?

by Anji
Ad

సినీ పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలోనే ఆయన పాన్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకరిగా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ బ్రేకులు పడినట్టు తెలుస్తోంది.

allu-arjun-in-ads

Advertisement

ప్రస్తుతం ఓ పాట షూటింగ్ జరగాల్సి ఉండగా.. అది వాయిదా పడినట్టు సమాచారం. ప్రస్తుతం పుష్ప 2 మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారనే చెప్పవచ్చు. అంతేకాదు.. చిత్ర బృందం మొత్తం ఈ మూవీని ఒక యుద్ధం మాదిరిగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ.. ఉండటం గమనార్హం. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడం దాదాపు పూర్తి అయిందట. ఒకపాటను మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉండగా.. దాని కోసం ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో అల్లు అర్జున్ కాస్త అస్వస్తతకు గురైనట్టు తెలుస్తోంది. 

ఈ ఐటమ్ సాంగ్ ని ఈ వారంలోనే చిత్రీకరించడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేయగా.. ఈ పాట షూటింగ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. అనుకోకుండా అల్లు అర్జున్ అనారోగ్యం పాలవ్వడమే ఈ పోస్ట్ పోన్ కి కారణం అని సమాచారం. ఉన్నట్టుండి ఇలా అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఆయన గత కొద్ది రోజులుగా ఈ చిత్రం కోసం రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారట. అంతేకాదు.. ఈ వారంలో జరిగే పాట చిత్రీకరణ విషయంలో కూడా అన్ని రకాలుగా సిద్ధం అయినట్టు తెలుస్తోంది. రిహార్సల్స్ కూడా పూర్తి చేశారట. ఉన్నట్టుండి ఇలా అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ ని రెండో వారానికి మేకర్స్ పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading