Home » బాలయ్య టాక్ షోకు అల్లు అర్జున్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

బాలయ్య టాక్ షోకు అల్లు అర్జున్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

by AJAY
Ad

ప్రస్తుతం ఓటిటిల హవా నడుస్తోంది. సినిమాలు థియేటర్ లో విడుదలైన నెల రోజులలోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. మరోవైపు భారీ టీవీ షోలను నిర్వహిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇక తెలుగులో అది పెద్ద ఓటీటీ గా పేరు సంపాదించుకున్న ఆహా టాక్ షోల తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహాలో సమంత సామ్ జామ్ పేరుతో టాక్ షోను నిర్వహించింది. ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయింది. ఈ షోకు టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Allu arjun balakrishna

Allu arjun balakrishna

ఇక ప్రస్తుతం నటసింహం నందమూరి బాలయ్య కూడా టాక్ షో తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటికే తన అన్ స్టాపబుల్ టాక్ షోకు పలువురు దిగ్గజాలను తీసుకువచ్చి ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలయ్య టాక్ షోకు రాబోతున్నారు. అల్లు అర్జున్ బాలయ్యల ఎపిసోడ్ డిసెంబర్ 25న ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ జోష్ లో ఉన్నారు.

Advertisement

Advertisement

బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా కూడా మంచి విజయం సాధించింది. మరి ఈ ఇద్దరు హీరోల సంభాషణ ఎలా ఉంటుందో చూడాలంటే క్రిస్మస్ వరకు వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading