Home » ‘జమల్‌ కుడు’పాటకు స్టెప్పులేసిన అల్లు అర్హ.. వీడియో వైరల్

‘జమల్‌ కుడు’పాటకు స్టెప్పులేసిన అల్లు అర్హ.. వీడియో వైరల్

by Anji
Ad

ఐకాన్  స్టార్‌ హీరో అల్లు అర్జున్‌  కూతురు అర్హ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేష్ బాబు కూతురితో పాటు అల్లు అర్హ కూడా అప్పుడప్పుడు తన తండ్రి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కాగా కూతురితో కలిసి బన్ని చేసే హంగామాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ అలరిస్తుంటాయి.

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియోతో తెగ అలరించింది అర్హ. ఈ మేరకు ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ మూవీలోని ‘జమల్‌ కుడు’ పాట యువతను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో మందు గ్లాస్‌ తలపై పెట్టుకుని బాబీ దేవోల్‌ వేసే స్టెప్‌లు బాగా ట్రెండ్‌ అయ్యాయి. ఇప్పుడు అదే పాటకు అర్హ కూడా అదిరిపోయే స్టెప్పులేసింది. తలపై గ్లాసుకు బదులు ప్లేట్‌ పెట్టుకుని, నడుచుకుంటూ వస్తున్న స్టిల్స్ తో అదరగొట్టేసింది.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌ అవుతున్నారు.

Also Read : రామ్ చరణ్ కి చిరంజీవి సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు ఏవో తెలుసా ?

Visitors Are Also Reading